మహర్షిలో ఏపి పాలిటిక్సా?

By Prashanth MFirst Published Feb 13, 2019, 2:49 PM IST
Highlights

మహేష్ 25వ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గత కొంత కాలంగా సినిమాకు సంబందించిన రూమర్స్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కి సంబందించిన న్యూస్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. 

మహేష్ 25వ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గత కొంత కాలంగా సినిమాకు సంబందించిన రూమర్స్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కి సంబందించిన న్యూస్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. భరత్ అనే నేను సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. 

ఇక మహర్షి సినిమాలో ఫ్రెండ్షిప్ కి సంబందించిన అంశాలతో పాటు పేరెంట్స్ ఎమోషన్స్ హైలెట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ ముందు నుంచి చెబుతూనే ఉంది. అయితే సినిమాలో తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ ను టచ్ చేసే అంశాలు కొన్ని ఉన్నట్లు వస్తోన్న వార్తలపై ఇటీవల దిల్ రాజు స్పందించారు. అసలు సినిమాలో ఎలాంటి రాజకీయాలకు సంబందించిన సీన్స్ లేవని అన్నారు. 

అయితే సొసైటీకి సంబందించిన కొన్ని అంశాలను దర్శకుడు వంశీ పైడిపల్లి చాలా బాగా డిజైన్ చేసుకున్నట్లు చెప్పారు. సినిమాను చూసిన తరువాత  ప్రతి ఒక్కరు సినిమాను ఫీల్ అయ్యి బరువెక్కిన గుండెలతో థియేటర్ బయటకు వస్తారని అంతగా ఎమోషన్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందని దిల్ రాజు వివరణ ఇచ్చారు. 

ఈ సినిమాలో అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చింది. వీలైనంత త్వరగా సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ తో సినిమాకు బజ్ క్రియేట్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ 25న సినిమా రిలీజ్ కాబోతోంది. 

click me!