40 వేల స్క్రీన్లలో ఆడనున్న రామ్ గోపాల్ వర్మ ‘లడ్కీ’.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..

Published : Jul 06, 2022, 03:06 PM ISTUpdated : Jul 06, 2022, 03:09 PM IST
40 వేల స్క్రీన్లలో ఆడనున్న రామ్ గోపాల్ వర్మ ‘లడ్కీ’.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..

సారాంశం

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వం వహించిన తొలి ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘లడ్కీ’ రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా రిలీజ్ డేట్ తో పాటు.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ను రిలీల్ చేశారు.   

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా తీసినా ప్రేక్షకులను ఆకట్టుకోవడం సహజమే. అయితే ఈ సారి ప్రపంచం మొత్తాన్ని తన సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు ఆర్జీవీ. ఈ మేరకు ఎప్పటి నుంచో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘లడ్కీ : గర్ల్ డ్రాగన్’ (Ladki : Girl Dragon)ను ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం చేశారు. ఈ చిత్రంలో లేడీ మార్షల్ ఆర్టిస్ట్, నటి పూజా భలేకర్ (Pooja Bhalekar) ప్రధాన పాత్రలో నటించారు. 

ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్లు, ట్రైలర్ గతంలోనే రిలీజ్ కాగా.. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది.  ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమైన ఈ చిత్రం గురించి ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ను అందించారు.  ఈ సినిమాను  చైనాలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. భారతీయ చలన చిత్రాల్లో చైనాలో రిలీజ్ కాబోతున్న తొలి చిత్రంగా ‘లడ్కీ’ రికార్డు క్రియేట్ చేసిందన్నారు.  జూలై 15న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.  ఈ సందర్భంగా చిత్ర మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. 

మరో తొమ్మిది రోజుల్లో చిత్రం రిలీజ్ కాబోతుండటంతో ఆస్తకికరమైన అంశాలను వెల్లడించారు. ఈచిత్రాన్ని గతంలో ఇండో-చైనీస్ గా చైనాలోనూ రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.  అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారంలో చైనాలో ఈ చిత్రాన్ని చైనీస్ వెర్షన్ లో 40 వేలకు పైగా స్క్రీన్ లలో విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అలాగే ఇండియాలోనూ తెలుగుతో పాటు  హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో విడుదల చేస్తున్నారు.

ఈ విషయంపై  RGV మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో ఇదొకటని తెలిపారు. తన చిన్నప్పటి నుంచి బ్రూస్ లీకి వీరాభిమాని అని, మార్షల్ ఆర్ట్స్‌లో కూడా తనకు కొంత ప్రావీణ్యం ఉందని తెలిపారు. ఎప్పటి నుంచో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకునే ఆయన కల జూలై 15తో సాకారం కానుందని వెల్లడించారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మతో పాటు చైనీస్ డైరెక్టర్ జింగ్ లియూ కూడా దర్శకత్వం వహించారు. ఆర్ట్సీ మీడియా ప్రొడక్షన్ మరియు స్పార్క్ బ్యానర్లపై మూవీని నిర్మించారు. ప్రధాన పాత్రలో పూజా భలేకర్ నటించగా.. మియా ముఖి, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటించారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా