ఏపీలో జగన్ గెలుపు.. యాత్ర, ఎన్టీఆర్ చిత్రాలతో పోల్చిన వర్మ!

By telugu teamFirst Published May 23, 2019, 1:00 PM IST
Highlights

ఏపీలో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోంది. అంచనాలకు మించి ఏకంగా 140కి పైగా స్థానాల్లో దూసుకుపోతుంది. 

ఏపీలో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోంది. అంచనాలకు మించి ఏకంగా 140కి పైగా స్థానాల్లో దూసుకుపోతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ కార్యాలయంతో పాటూ తాడేపల్లిలోని జగన్ నివాసం సందడి కనిపిస్తోంది.

జగన్ గెలుపుపై పార్టీ నేతలతో పాటు ప్రముఖులు, అభిమానులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు పెడుతూ ఓ పక్కన జగన్ ని పొగుడుతూ మరోపక్క చంద్రబాబుని కించపరుస్తున్నారు.

1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పుట్టిందని, మే 23, 2019 లో చనిపోయిందని, దానికి గల కారణాలు అబద్ధాలు, పక్కవాళ్ల గురించి తప్పుగా మాట్లాడడం, లంచగొండితనం, నారా లోకేష్, వైఎస్ జగన్ అని రాసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుస్తుందని చెప్పిన లగడపాటికి సంబంధించి ఓ మీమ్ షేర్ చేశారు. జగన్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు నాయుడికి సంతాపం తెలిపారు.

ఈ ఎన్నికల ఫలితాలను యాత్ర, ఎన్టీఆర్ సినిమాలతో పోలుస్తూ.. ప్రతీదీ ఇంటర్లింక్ అయి ఉంటుందని చెప్పాడు. వరుసగా చంద్రబాబుని కించపరుస్తూ ఉన్న వీడియోలను, మీమ్స్ ని షేర్ చేస్తూనే ఉన్నాడు వర్మ. 

pic.twitter.com/o7l6lpJfL9

— Ram Gopal Varma (@RGVzoomin)

 

pic.twitter.com/VkLtF7kR7Z

— Ram Gopal Varma (@RGVzoomin)

 

Hearty congratulations to and Heart felt condolences to

— Ram Gopal Varma (@RGVzoomin)
click me!