రాజు రవితేజ కన్నా ప్రమాదం, వెధవలను పక్కన పెట్టు: పవన్ కు ఆర్జీవి సలహా

Published : Apr 22, 2018, 01:30 PM IST
రాజు రవితేజ కన్నా ప్రమాదం, వెధవలను పక్కన పెట్టు: పవన్ కు ఆర్జీవి సలహా

సారాంశం

రాజు రవితేజ కన్నా ప్రమాదం, వెధవలను పక్కన పెట్టు: పవన్ కు ఆర్జీవి సలహా

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. తన తల్లిపై వేసిన ఒట్టును పక్కన పెట్టి ఆయన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తనను పక్కదోవ పట్టిస్తున్న వెధవలను పక్కన పెట్టి వాస్తవాలు గ్రహించాలని అన్నారు. రవి ప్రకాశ్ మీద పవన్ కల్యాణ్ వీడియో పోస్టుపై స్పందిస్తూ "హే, పవన్ కల్యాణ్! అది కొత్తదేం కాదు. ఐదేళ్ల క్రితం వీడియో... లక్షల సార్లు సర్క్యులేట్ అయింది. ఆ వీడియో పెట్టమని నీకు సలహా ఇచ్చిన వెధవలను పక్కన పెట్టేయ్. వాళ్లు రాజ రవితేజ కన్నా ప్రమాదకరమ"ని ఆర్జీవి ట్వీట్ చేశారు. రవి ప్రకాశ్ కు మాత్రమే కాదు, ప్రతీ ఒక్కరి కూడా అది పాతదనే విషయం తెలుసునని, దానిపై అతను వివరణ కూడా ఇచ్చాడని స్పష్టం చేశారు. "నీ పక్కనున్నవారే అది ఎవరికీ తెలీదని నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. వారిని పక్కన పెట్టు" అని అన్నారు. కాస్టింగ్ కౌచ్ బాధితులను, అప్పారావ్ లాంటి వాళ్ల దౌర్జన్యాలకు బలైనవారిని పవన్ వ్యభిచారుణులతో పోల్చడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "పవన్ కల్యాణ్.. వాళ్లంతా వ్యభిచారిణులు అంటే, మహిళా సంఘాలు ఏ మాత్రం స్పందించడం? శ్రీరెడ్డి కోపంలో తిట్టు ఎక్కువా? పవన్ కి ఆ అమ్మాయిలపైన ఇంత హేవభావం ఎక్కువా?" రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?