బోల్డ్ బ్యూటీకి వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ సపోర్ట్ .. ఆ అర్హత ఆమెకే ఉంది!

Published : Dec 10, 2020, 10:03 AM IST
బోల్డ్ బ్యూటీకి వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ సపోర్ట్ .. ఆ అర్హత ఆమెకే ఉంది!

సారాంశం

అరియానాకి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అండగా నిలిచారు. ఆమెకి సపోర్ట్ చేస్తూ ట్వీట్‌ చేశారు. `నిజంగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ అరియానా. ఆమెకి ఓట్‌ వేసి గెలిపించండి` అని బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లోని ఓ క్లిప్‌ని పంచుకున్నారు. 

బోల్డ్ బ్యూటీ అరియానా రెండు మూడు సార్లు ఎలిమినేషన్‌లో చివరి వరకు వెళ్ళి సేవ్‌ అయ్యింది. గత వారం కూడా తన స్నేహితుడు అవినాష్‌తో జరిగిన పోటీలో అరియానా సేవ్‌ అయ్యింది. ప్రస్తుతం హౌజ్‌లో చాలా ఫైరింగ్‌తో గేమ్‌ ఆడుతుంది. బుధవారం ఎపిసోడ్‌లో సోహైల్‌కి దీటుగా రియాక్ట్ అయ్యింది. అతని తీరుపై మండిపడింది. తన గేమ్‌ తాడు ఆడుతున్నట్టు తెలిపింది. సోహైల్‌ బాగా ఫైర్‌ కావడంతో కన్నీళ్లు పెట్టుకుంది. తన గేమ్‌ తాను ఆడటం కూడా తప్పా అంటూ బిగ్‌బాస్ ని ప్రశ్నించింది. 

ఇదిలా ఉంటే అరియానాకి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అండగా నిలిచారు. ఆమెకి సపోర్ట్ చేస్తూ ట్వీట్‌ చేశారు. `నిజంగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ అరియానా. ఆమెకి ఓట్‌ వేసి గెలిపించండి` అని బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లోని ఓ క్లిప్‌ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌కి వచ్చే ముందు అరియానా.. రామ్‌గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేసింది. అది ట్రెండ్‌ అయ్యింది. అంతేకాదు ఇటీవల వర్మ స్పందిస్తూ, అరియానా బయటకు వచ్చాక ఆమెతో ఓ సినిమా తీస్తానని తెలిపిన విషయం తెలిసిందే. మరి ఈ వారం నామినేషన్‌లో ఉన్న అరియానా సేవ్‌ అవుతుందా? ఎలిమినేట్‌ అవుతుందా? అన్నది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు