బాలనటుడిగా నాగ్ ని చూశారా... ఇదిగో వర్మ పరిచయం చేశాడు చూడండి!

Published : Mar 18, 2021, 02:56 PM IST
బాలనటుడిగా నాగ్ ని చూశారా... ఇదిగో వర్మ పరిచయం చేశాడు చూడండి!

సారాంశం

సుడిగుండాలు చిత్రంలో నాగేశ్వరరావు కొడుకు పాత్ర నాగార్జున చేశాడు. నాలుగేళ్ళ ప్రాయంలో ఉన్న నాగార్జునను స్కూల్ కి తన కారులో నాగేశ్వరరావు తీసుకెళ్తారు. ఆ సన్నివేశాన్ని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇక అక్కినేని హీరోగా తెరకెక్కిన వెలుగు నీడలు మూవీలో కూడా నాగేశ్వరరావు కొడుకు పాత్రను నాగార్జున చేయడం విశేషం.   

తనకు ఏమనిపించినా వెంటనే ఫ్యాన్స్ చెప్పేస్తాడు వర్మ. ట్విట్టర్ లో వాలిపోయి... సంచలనమో, సమాచారమో ఇచ్చేస్తాడు. దాదాపు ఎవరో ఒకరిని గెలికేలా వర్మ ట్వీట్స్ ఉంటాయి. ఈ సారి వర్మ అక్కినేని అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. చిన్నతనంలో కింగ్ నాగార్జున తండ్రి నాగేశ్వరరావుతో నటించిన చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. అలాగే ఆ సన్నివేశంలో ఉన్నది నాగార్జున అని తెలియజేశాడు. 

సుడిగుండాలు చిత్రంలో నాగేశ్వరరావు కొడుకు పాత్ర నాగార్జున చేశాడు. నాలుగేళ్ళ ప్రాయంలో ఉన్న నాగార్జునను స్కూల్ కి తన కారులో నాగేశ్వరరావు తీసుకెళ్తారు. ఆ సన్నివేశాన్ని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇక అక్కినేని హీరోగా తెరకెక్కిన వెలుగు నీడలు మూవీలో కూడా నాగేశ్వరరావు కొడుకు పాత్రను నాగార్జున చేయడం విశేషం. 

ఇక నాగార్జున హీరోగా అయ్యాక ‘కలెక్టర్ గారి అబ్బాయి’, ‘అగ్నిపుత్రుడు’, ‘రావుగారిల్లు’, ‘ఇద్దరు ఇద్ద‌రే’, ‘శ్రీరామ‌దాసు’, ‘మ‌నం’ వంటి చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు. మనం నాగేశ్వర రావు నటించిన చివరి చిత్రం కావడం విశేషం. దర్శకుడుగా వర్మకు మొదట అవకాశం ఇచ్చిన నాగార్జునపై ఆయన ఇలా అభిమానం చాటుకుంటున్నారేమో.. 
 
PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?