టీచర్లంతా ఈ విస్కీ తాగండి.. రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

By tirumala ANFirst Published Sep 5, 2019, 3:19 PM IST
Highlights

ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించి తద్వారా పబ్లిసిటీ పొందాలని ప్రయత్నించే దర్శకుడు వర్మ. సందర్భాన్ని చూసుకుని ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాజాగా టీచర్స్ డేని సందర్భంగా రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. 

ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించి తద్వారా పబ్లిసిటీ పొందాలని ప్రయత్నించే దర్శకుడు వర్మ. సందర్భాన్ని చూసుకుని ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాజాగా టీచర్స్ డేని సందర్భంగా రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. 

రాంగోపాల్ వర్మ టీచర్స్ డే రోజున టీచర్స్ విస్కీ అనే ఆల్కహాల్ బ్రాండ్ కి సంబంధించిన వివాదాస్పద ట్వీట్స్ చేశారు. 'నా టీచర్లంతా నన్నో మంచి విద్యార్థిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దడంలో దారుణంగా విఫలమయ్యారు. కాబట్టి టీచర్స్ డే రోజున ఏం మాట్లాడాలో నాకు తెలియదు. 

బహుశా నేను బ్యాడ్ స్టూడెంట్ ని కావచ్చు. ఒక బ్యాడ్ స్టూడెంట్ ని గుడ్ స్టూడెంట్ గా మార్చడం టీచర్ల భాద్యత. ఆ విషయంలో వాళ్ళు విఫలమయ్యారు కాబట్టి నా టీచర్లు బ్యాడ్ టీచర్స్ అని రుజువైంది. 

టీచర్స్ డే సందర్భంగా టీచర్లంతా ఈ టీచర్స్ విస్కీ తాగి సెలెబ్రేట్ చేసుకుంటారా ? జస్ట్ ఆస్కింగ్' అని ట్వీట్ చేసి వర్మ మరోసారి తన పైత్యాన్ని బయటపెట్టాడు. 

 

Do Teachers celebrate TEACHER’S DAY by drinking TEACHER’S WHISKY? ..just asking! pic.twitter.com/n5C5qSejow

— Ram Gopal Varma (@RGVzoomin)

Even if I was a bad student,isn’t it the job of good teachers to make a bad student into a good student ? ..Since they failed, hence proved that they were bad teachers 💪💪💪

— Ram Gopal Varma (@RGVzoomin)

All my teachers miserably failed in making me a good student and a good human being .So I don’t know what to say about TEACHER’S DAY😡

— Ram Gopal Varma (@RGVzoomin)
click me!