Varma: బాలీవుడ్ పుండుపై కారం చల్లిన వర్మ... కెజిఎఫ్2, బాహుబలి2 ... వాళ్ళ ఫీలింగ్ ఏంటంటూ సెటైర్!

Published : Apr 14, 2022, 05:13 PM IST
Varma: బాలీవుడ్ పుండుపై కారం చల్లిన వర్మ... కెజిఎఫ్2, బాహుబలి2 ... వాళ్ళ ఫీలింగ్ ఏంటంటూ సెటైర్!

సారాంశం

ఎదురుదెబ్బ తగిలి క్రింద పడ్డ వాడ్ని చూసి నవ్వితే ఎలా ఉంటుంది?. వివాదాల వర్మ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ అలానే ఉంది. సౌత్ సినిమాలు నార్త్ ని ఏలేస్తున్నాయని ఏడుస్తున్న బాలీవుడ్ ని ఇంకా ఏడిపిస్తున్నాడు వర్మ.

బాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)జోరు తగ్గక ముందే మరో సౌత్ మూవీ రంగంలోకి దిగింది. కెజిఎఫ్ చాప్టర్ 2 సునామీలా బాక్సాఫీస్ పై విరుచుకుపడింది.కెజిఎఫ్2  హిందీ వర్షన్ బుకింగ్స్ లో దుమ్మురేపగా నేడు థియేటర్స్ వద్ద జనాలు సినిమా కోసం ఎగబడుతున్నారు. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ బాహుబలి 2 డే వన్ రికార్డు బ్రేక్ చేసేలాఉన్నాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఓ సెటైరికల్ ట్వీట్ వేశారు. ఆయన ట్వీట్ వైరల్ గా మారింది. 

డబ్బింగ్ చిత్రాలైన కెజిఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2), బాహుబలి 2 హిందీ బాక్సాఫీస్ హిస్టరీలో టాప్ ఓపెనర్స్ గా ఉన్నాయి. దీనిపై బాలీవుడ్ వర్గాల స్పందన ఏంటని మీ అభిప్రాయం?.. అంటూ ట్వీట్ చేశారు. దేశంలో పెద్ద పరిశ్రమగా చెప్పుకునే బాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీ సౌత్ చిత్రాలు తిరగరాసిన నేపథ్యంలో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండొచ్చంటూ... వర్మ (Ram Gopal Varma) నెటిజెన్స్ ని ప్రశ్నించారు. నిజంగా ఇలాంటి సెటైర్స్ బాలీవుడ్ వర్గాలను మరింత ఇబ్బంది పెడతాయండంలో ఎటువంటి సందేహం లేదు. 

ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ తమ అసహనం బయటపెడుతున్నారు. సౌత్ సినిమాలు నార్త్ లో ఆడుతున్నప్పుడు, నార్త్ సినిమాలు సౌత్ లో ఎందుకు ఆడటం లేదంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే మరొక హీరో జాన్ అబ్రహం సౌత్ చిత్రాలపై తన ఆవేశం బయటపెట్టారు. అటాక్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న జాన్ అబ్రహం... నేను సౌత్ చిత్రాల్లో నటించను. దేశంలో ఎప్పటికీ బాలీవుడ్ నే పెద్ద పరిశ్రమ. బాలీవుడ్ హీరోగా నేను హిందీ చిత్రాల్లోనే నటిస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

ఒక ప్రక్క నార్త్ పై సౌత్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. కనీస బుకింగ్స్ దక్కని కారణంగా కెజిఎఫ్ చాప్టర్ 2కి పోటీగా విడుదల కావాల్సిన షాహిద్ కపూర్ 'జెర్సీ' విడుదల వాయిదా వేశారు. ఓ డబ్బింగ్ మూవీ ప్రభంజనం తట్టుకోలేక స్టైట్ మూవీ వాయిదా వేయడం ఎవరూ ఊహించని పరిణామం. అంతకంతకూ నార్త్ పై సౌత్ ఆధిపత్యం పెరిగిపోతున్న నేపథ్యంలో బాలీవుడ్ వాళ్లకు ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి నెలకొంది. నెలల వ్యవధిలో పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కె జి ఎఫ్ చాప్టర్ 2 బాలీవుడ్ లో భారీ విజయాలు దక్కించుకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా
ఎన్టీఆర్ 'సింహాద్రి'ని వద్దనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.? అస్సలు ఊహించలేరు