జయలలిత, శశికళ  జీవితాలను కెలకనున్న వర్మ...మూవీ వచ్చేస్తుంది

Published : Nov 21, 2020, 11:19 PM IST
జయలలిత, శశికళ  జీవితాలను కెలకనున్న వర్మ...మూవీ వచ్చేస్తుంది

సారాంశం

జయలలిత, శశికళ జీవితాలపై వర్మ సినిమా తీయనున్నట్లు తీస్తున్నట్లు ప్రకటించారు. శశి కళ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తమిళనాడు ఎన్నికలకు ముందే విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే పోస్టర్ విడుదల చేశాడు. అనేక కాంట్రవర్సీ సినిమాలు తెరకెక్కించిన వర్మ జయలలిత మరియు శశి కళ బంధాన్ని ఎలా తెరపై చూపించనున్నారనో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తమిళ రాజకీయాలలో జయలలిత ఓ ప్రభంజనం. తమిళుల ఆరాధ్య దేవతగా ఆమె ఎదిగారు. అవమానాలు, అసహ్యంపిలు ఎదుర్కొన్న జయలలిత తమిళనాడు సీఎం అయ్యారు. ఐతే జయలలిత జీవితంలో శశికళకు విడదీయరాని సంబంధం ఉంది . కుటుంబ సభ్యులకు మించి శశికళను ప్రేమించారు జయలలిత. ఒకరిలో ఒకరిలా, ఇద్దరిగా బ్రతుకుతున్న ఒకరిలా బ్రతికారు. 

జయలలిత, శశికళ ఒకే రకమైన దుస్తులు, నగలు కుడా ధరించే వారు. సీఎం కుర్చీలో జయలలిత కూర్చున్నా కానీ శశికళ కూడా ఆ కుర్చీలో ఉన్నట్లే లెక్క. అలాంటి వీరిద్దరి జీవితాల గురించి రామ్ గోపాల్ వర్మ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. జయలలిత, శశికళ జీవితాలపై వర్మ సినిమా తీయనున్నట్లు తీస్తున్నట్లు ప్రకటించారు. 

శశి కళ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తమిళనాడు ఎన్నికలకు ముందే విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే పోస్టర్ విడుదల చేశాడు. అనేక కాంట్రవర్సీ సినిమాలు తెరకెక్కించిన వర్మ జయలలిత మరియు శశి కళ బంధాన్ని ఎలా తెరపై చూపించనున్నారనో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మరి జయలలిత మరణం వెనుక శశికళ హస్తం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేయగా, వర్మ మూవీలో మరి దీనిపై కూడా ఓ స్పష్టత ఇస్తాడేమో చూడాలి. మొత్తంగా ప్రకటనతోనే వర్మ మంచి ప్రచారం దక్కించుకున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి