RC15 రిలీజ్ పై లేటెస్ట్ బజ్? అలాగైతే ఫ్యాన్స్ కు ఇంకా వెయిటింగ్ తప్పదు.. కానీ!

By team telugu  |  First Published Jan 29, 2023, 2:46 PM IST

ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుద్దిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ‘ఆర్సీ15’ వర్క్ టైటిల్ తో షూటింగ్ కొనసాగుతోంది. అయితే తాజాగా సినిమా రిలీజ్ పై స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
 


‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. దాంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అధికమైంది. ఈ క్రమంలో అభిమానులు అందరూ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చరణ్  ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ శంకర్ (Shankar) డైరెక్షన్ లో నటిస్తున్నారు. RC15 వర్క్ టైటిల్ తో రూపుదద్దుకుంటోందీ చిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 

అయితే, 2021 ఫిబ్రవరిలోనే ఈ చిత్రాన్ని ప్రకటించి అదే ఏడాది అక్టోబర్ లో షూటింగ్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వెంటనే ఈ చిత్రం విడుదలవుతుందని అంతా భావించారు. కానీ అప్పటి వరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు. శంకర్ ‘భారతీయుడు 2’ను ప్రారంభించడంతో ‘ఆర్సీ15’ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. గతేడాది విడుదల మిస్ అయ్యింది. ఇక ఏదేమైనా 2023లో విడుదల చేస్తారని ఫ్యాన్స్, ఆడియెన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

కానీ, వారిందకీ లేటెస్ట్ బజ్ మాత్రం షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ఏడాది కూడా ‘ఆర్సీ15’ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్. అప్పటికే రిలీజ్ కరెక్ట్ గా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ బజ్ అయితే క్రియేట్ అయ్యింది. 

దీని ప్రకారం.. ‘ఆర్సీ15’ వచ్చే వరకు అభిమానులకు వెయింట్ తప్పదనే చెప్పాలి. ఇక షూటింగ్ 2023 మేలో పూర్తవుతుందని అంటున్నారు. ఆ తర్వాత నెలలో రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘ఆర్సీ16’ షూటింగ్ లో జాయిన్ కానున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.  ఇక మరో  రెండు నెలల్లో రామ్ చరణ్ బర్త్ డే ఉండటంతో అప్పటికైనా ‘ఆర్సీ15’ నుంచి ఫస్ట్ లుక్ వస్తుందని ఆశిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్ లో షూటింగ్ కొనసాగింది. రీసెంట్ గా న్యూజిలాండ్ లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

click me!