ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతీ కోసం.. రామ్ చరణ్ భార్య ఉపాసన కాస్ట్లీ గిఫ్ట్...?

By Mahesh JujjuriFirst Published Mar 31, 2023, 7:03 AM IST
Highlights

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కోసం.. రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ కాస్ట్లీ గిప్ట్ పంపించారట. అది తెగ నచ్చేయడంతో.. తారక్ వైఫ్ ఆ గిఫ్ట్ ను వదిలిపెట్టడంలేదట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న. ఈ న్యూస్ సంగతేంటి..? ఏంటా గిఫ్ట్..? రూమర్ లో నిజమెంత...? 

ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయాలు స్నేహాలు కామన్.. ముఖ్యంగా హీరోల భార్యలు ఎప్పుడూ కలవనట్టేఉంటారు కాని.. మంచి అనుబంధం వారి మధ్య కొనసాగుతుంటుంది. బయట మాత్రం పెద్దగా తిరిగినట్టు కనిపించరు. ఈమధ్యలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ భార్యలు లక్ష్మీ ప్రణతి, ఉపాసన ల మధ్య స్నేహం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటీ అంటే.. 

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చేతి కి ఉన్న హ్యాండ్ బ్యాగ్.. చూశారా.. ఈ ఫోటోలో కనిపిస్తున్న హ్యాండ్ బ్యాక్ ఇప్పుడు  సోషల్ మీడియాని షేక్ చేస్తుంది .  చాలా స్టైలిష్ గా... చాలా ట్రెండీగా ఉండే ఈ హ్యాండ్ బ్యాగ్.. ఉపాసన ఎన్టీఆర్ వైఫ్ కు గిఫ్ట్ గా ఇచ్చిందట. దాంతో ఈ బ్యాగ్ తెగ నచ్చేసి.. అస్సలు వదిలిపెట్టడంలేదట తారక్ భార్య. దాంతో ఈ బ్యాక్ ఇప్పుడు ఈన్యూస్ వైరల్ అవుతోంది. అంతే కాదు దీని కాస్ట్ తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సింది. 

అసలు ఉపాసన ఇచ్చిన ఈ బ్యాక్ కాస్ట్ ఎంత అని నెటిజన్లంతా తెగ వెతికేశారట, ఇంటర్నెట్ ను జల్లెడ పట్టేశారట.  అమ్మాయిలకు తెగ నచ్చేసిన ఈ బ్యాక్ కాస్ట్.. అక్షరాలా..   3 లక్షల.. 28 వేల..  145 రూపాయలట. అంతే కాదు   45000 విలువ చేసే ఓ డ్రెస్ ను కూడా ఉపాసన లక్ష్మీ ప్రణతికోసం తీసుకుందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి అనుంధం గురించిన వార్త తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఇలాగే కొనసాగాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు..

ఇక ఆస్కార్ విన్నింగ్ తరువాత హైదరాబాద్ వచ్చిన ఇద్దరు స్టార్లు ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నారు. రామ్ చరణ్ తాజాగా తన భార్య ఉపాసనతో వెకేషన్ కు దుబయ్ చెక్కేశాడు.. ఇక ఎన్టీఆర్ తన 30 వసినిమా ఓపెనింగ్ చేసి.. షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చి.. ఇంట్లో తన భార్య పిల్లలతో సరదాగా టైమ్ గడిపేస్తున్నాడు. త్వరలో ఎన్టీఆర్ 30 రెగ్యూలర్ షూటింగ్ కు వెళ్ళబోతున్నారు. అటు రామ్ చరణ్ కూడా వెకేషన్ నుంచి వచ్చిన తరువాత శంకర డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ బ్యాలన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేయబోతున్నారు. 

click me!