#Ram Charan:ఒకే స్టేజిపై ప్రధాని మోడీ, రామ్ చరణ్

By Surya PrakashFirst Published Dec 14, 2022, 11:55 AM IST
Highlights

ప్రముఖ స్వామి మహారాజ్ జన్మ శతాబ్ది ఉత్సవాల్లో రామ్ చరణ్  ప్రధాని మోదీతో వేదికను పంచుకోవడానికి సిద్ధమయ్యారు.


ప్రస్తుతం రామ్ చరణ్ కు గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాత ఆయన స్టేచరే మారిపోయింది.  ఎన్డీటీవీ అవార్డు సహా ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన చెంత వాలుతున్నాయి.  అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’కు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. తాజాగా రాంచరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.
 
గుజరాత్లోని అహ్మదాబాద్ లో  జరగనున్న ప్రముఖ స్వామి మహారాజ్ జన్మ శతాబ్ది ఉత్సవాల్లో రామ్ చరణ్  ప్రధాని మోదీతో వేదికను పంచుకోవడానికి సిద్ధమయ్యారు. రేపు డిసెంబర్ 14వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమంలో మోడీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించింది. యాదృచ్ఛికంగానే  రామ్ చరణ్  ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారని తెలుస్తోంది. రాంచరణ్  కూడా అదే కార్యక్రమంలో పాల్గొననున్నాడు. ఈ ఈవెంట్ కు రామ్ చరణ్ ని ఆహ్వానిస్తున్న మహారాజ్ శిష్యుల చిత్రాలు సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని ఒగనాజ్‌లో ప్రముఖ్‌ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. పీఎస్‌ఎమ్‌ 100 పేరుతో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుండి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. బుధవారం (డిసెంబర్‌ 14) నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వామి మహారాజ్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నారు. 

BAPS అధినేత మహంత్ స్వామి సమక్షంలో డిసెంబర్ 14న సాయంత్రం ఐదు గంటలకు ఈ ఉత్సవాలు ప్రారంభం అవనునన్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖేశ్‌ అంబానీలతో సహా పలువురు దక్షిణాది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.  దీనికి సంబంధించిన ఫొటోను చెర్రీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

మోడీ ముఖేష్ , అంబానీ లాంటి దేశంలోనే టాప్ ప్రముఖులు పాల్గొనే ఈ ఈవెంట్లో రాంచరణ్ కు  మాత్రమే ఆహ్వానం అందడం తెలుగు హీరోకు దక్కిన గౌరవంగా చెప్పొచ్చు.    రాంచరణ్ కు భక్తిభావాలు ఎక్కువ. అందుకే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మోడీతోపాటు పాల్గొనే అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తోంది.
 

click me!