
గత కొద్ది రోజులుగా నిలిచిపోయిన రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ మూవీ షూటింగ్ ఇక పరుగులు పెట్టబోతోంది. ఈ మూవీలో కీలక షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు టీమ్..?
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఆర్ సి 15 మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా జరిగింది. ఈ లెక్కన త్వరలో రిలీజ్ డేట్ కూడా ఇస్తారు అని అనుకున్నారు మెగా ఫ్యాన్స్. ఇక దాదాపు 60 శాతం పైన షూటింగ్ కంప్లీట్ అయ్యింది కూడా. ఇక అది కూడా అవుతుంది అనుకున్న టైమ్ లో రామ్ చరణ్ కు కమల్ హాసన్ అడ్డు వచ్చాడు. ఈ సినిమా కంటే ముందు స్టార్ట్ అయ్యి.. వివాదాల వల్ల ఆగిపోయిన భారతీయుడు 2 సినిమా షూటింగ్ కు లైన్ క్లియర్ అవ్వడంతో... ఇక్కడ ఈ సినిమాను పక్కన పడేసి శంకర్ అక్కడికి వెళ్ళిపోయాడు.
దాంతో కొంత కాలంగా రామ్ చరణ్ రెస్ట్ తీసుకోక తప్పలేదు. అయితే ఈ టైమ్ కూడా రామ్ చరణ్ కు కలిసి వచ్చింది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేస్తుండటంతో.. అక్కడ ప్రమోషన్స్ కు వెళ్ళడం.. అక్కడ నుంచి టాంజానియాకు ఉపాసనతో కలిసి వెళ్ళి హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేశాడు చరణ్. ఇక భారతీయుడు షూటింగ్ ను అంతా సెట్ చేసుకుని.. ముందు రామ్ చరణ్ సినిమాను కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యాడు శంకర్ ఇందులో భాగంగా.. చరణ్ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నారట.
ఈ క్రమంలో న్యూజిలాండ్ లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారట టీమ్. ఇందుకోసం అన్ని సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక దీని కోసం చరణ్ సోమవారం న్యూజిలాండ్ బయల్దేరుతున్నారు. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా శనివారం ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్ లో వెల్లడించారు. అలాగే సినిమా అప్ డేట్స్ విషయంలో తనని ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని భారమంతా శంకర్ పైనే వేశానని చెప్పారు. అంతే కాదు ఈ సినిమా ప్రమోషన్స్ కు సబంధించి అన్నీ పనులు శంకర్ మాత్రమే చూసుకుంటారని చెప్పారు.
చాలా కాలంగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. సోషల్ మీడియా వేధికగా అడిగేస్తున్నారు. ఈరంగా వారికి సాలిడ్ అప్ డేట్ అందించారు. కొన్ని నెలలుగా సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంలో కనిపిస్తున్నారు. రిలీజ్ సైతం వాయిదా పడుతోంది అన్న వార్త అభిమానుల్ని కలవరపెట్టింది. ఇక ఈమూవీని నెక్ట్స్ ఇయర్ సమ్మర్ వరకూ రిలీజ్ చేస్తారా..? లేక అంతకు ముందే ప్లాన్ చేస్తారా అనేది చూడాలి.