పునీత్‌ లేరంటే నమ్మను.. ఆయన్ని శివరాజ్‌కుమార్‌లో చూసుకుంటాంః రామ్‌చరణ్‌ ఎమోషనల్‌ స్పీచ్‌

Published : Mar 19, 2022, 10:04 PM ISTUpdated : Mar 20, 2022, 10:09 AM IST
పునీత్‌ లేరంటే నమ్మను.. ఆయన్ని శివరాజ్‌కుమార్‌లో చూసుకుంటాంః రామ్‌చరణ్‌ ఎమోషనల్‌ స్పీచ్‌

సారాంశం

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ని తలచుకున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ మన మధ్య లేరంటే నమ్మను అని, నమ్మలేనని, ఆయన లేరనే వార్త నిజం కాదని అన్నారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌` బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్‌(RRR Pre Release Event) ఈవెంట్‌ గ్రాండ్‌గా జరుగుతుంది. భారీగా ఎన్టీఆర్‌, చరణ్‌ అభిమానులు తరలి రావడంతో `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) ఈవెంట్‌ పోటెత్తిపోయింది. ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోవడం విశేం. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ (Ram Charan) మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ని తలచుకున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ మన మధ్య లేరంటే నమ్మను అని, నమ్మలేనని, ఆయన లేరనే వార్త నిజం కాదని అన్నారు. ఆయన మన మధ్యే ఉన్నారని, ఆయన లేని లోటు శివన్న ద్వారా తీర్చుకుంటామన్నారు. శివరాజ్‌కుమార్‌లో ఆయన్ని చూసుకుంటామని తెలిపారు.  శివరాజ్‌కుమార్‌ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని, తెలిపారు. ఈ సందర్భంగా సీఎం బసవరాజు బొమ్మైకి ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు అద్భుతమైన పాటలు అందించిన ఎంఎం కీరవాణికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన సారథ్యంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు చరణ్‌. అలాగే ఈ వేడుకని వచ్చి ఇంతటి సక్సెస్‌ చేసిన ఎన్టీఆర్‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మెగా అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు రామ్‌చరణ్‌. ఒక నీడ లాగా నాకు, తారక్‌కి అండగా ఉన్నారని చెప్పారు. 

ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా విషయంలో జీరో ఫీలింగ్‌తో ఉన్నా. ఎలా ఉంటుందో చూడాలన్నారు. నిర్మాత దానయ్యకి, రాజమౌళి టీమ్‌ అందరికి ధన్యవాదాలు తెలిపారు చరణ్‌. ఎన్టీఆర్‌, చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. డివివి దానయ్య నిర్మించారు. అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా, అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి