ఉపాసన లేకుండా చరణ్ వెకేషన్... పాపం బాగా ఫీల్ అవుతుందే!

Published : Sep 09, 2022, 12:33 PM ISTUpdated : Sep 09, 2022, 12:35 PM IST
ఉపాసన లేకుండా చరణ్ వెకేషన్... పాపం బాగా ఫీల్ అవుతుందే!

సారాంశం

భార్య ఉపాసన లేకుండా రామ్ చరణ్ వెకేషన్ కి వెళ్లారు. భర్తను మిస్ అవుతూ ఆమె ఆసక్తికర సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.   

రామ్ చరణ్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఆర్ సి 15 షూట్ కి గ్యాప్ రావడంతో ఆయనకు విరామం దొరికింది. భారతీయుడు 2 షూటింగ్ తిరిగి ప్రారంభించిన శంకర్ రామ్ చరణ్ మూవీని తాత్కాలింగా పక్కన పెట్టాడు. కమల్ హాసన్ హీరోగా శంకర్ చాలా కాలం క్రితమే భారతీయుడు 2 స్టార్ట్ చేశారు. నిర్మాతలతో దర్శకుడు శంకర్ కి ఏర్పడిన వివాదాల కారణంగా మూవీ డిలే అయ్యింది. ప్రాజెక్ట్ దాదాపు వదిలేద్దాం అనుకుంటున్న తరుణంలో విక్రమ్ సక్సెస్ ప్రాజెక్ట్ కి ఊపిరి పోసింది. కమల్ విక్రమ్ మూవీతో వందల కోట్లు కొల్లగొట్టాడు. 

కమల్ స్టామినా ఏమిటో నిరూపించిన విక్రమ్ ఆయన మార్కెట్ కి ఎలాంటి ఢోకా లేదని రుజువు చేసింది. దీంతో నిర్మాతలు భారతీయుడు 2 పూర్తి చేసి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేవరకు రామ్ చరణ్ ఫ్రీగా ఉంటారు. ఇక ఖాళీ సమయాన్ని రామ్ చరణ్ వెకేషన్ కోసం వినియోగిస్తున్నారు. సిస్టర్స్ శ్రీజ, సుస్మిత, వాళ్ళ పిల్లలతో పాటు రామ్ చరణ్ టూర్ కి వెళ్ళాడు. ప్రత్యేక విమానంలో విహారానికి చెక్కేశారు. 

బిజీగా ఉన్న ఉపాసన ఈ టూర్ మిస్ అయ్యారు. దీంతో రామ్ చరణ్ ని మిస్ అవుతున్నట్లు ఉపాసన సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. రామ్ అండ్ రైమ్ ని చాలా మిస్ అవుతున్నట్లు తెలియజేశారు. రైమ్ రామ్ చరణ్ పెట్ డాగ్ కాగా... దాన్ని వదిలి ఆయన అసలుండరు. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ టైం లో రైమ్ ని తీసుకొని రామ్ చరణ్ దేశం మొత్తం తిరిగారు. ఇక రామ్ చరణ్ ని ఉపాసన ఎంతగా మిస్ అవుతున్నారో తెలిసి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వదిన కూడా వెళితే బాగుండేది అంటున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు