అరవిందస్వామితో ఇబ్బందయ్యింది-చరణ్ ఇంటర్వ్యూ

Published : Dec 07, 2016, 03:50 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
అరవిందస్వామితో ఇబ్బందయ్యింది-చరణ్ ఇంటర్వ్యూ

సారాంశం

ధృవరిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ ఇంటర్వ్యూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన రామ్ చరణ్ షూటింగ్ లో అరవింద స్వామితో ఇబ్బంది పడడ్డానంటున్న మెగా పవర్ స్టార్

1ప్రశ్న... ధృవ రిలీజ్ డేట్ దగ్గరికొచ్చింది. టెన్షన్ పడుతున్నారా...

రామ్ చరణ్.... ప్రతి సినిమా ముందు ఉండే టెన్షన్ ఉంది.. కానీ కాన్ఫిడెన్స్ కూడా అంతే ఉంది. రీమేక్ కాబట్టి కాస్త ఎక్కువ టెన్షన్ ఉంది. సినిమా వేరే భాషలో ఆల్రెడీ సక్సెస్ అయినా కూడా.. కథ, కథనం మనకు కొత్తే. మన జనాలకు చూపించేటప్పుడు కొత్తగానే ఉండాలి. పక్కనోడు హిట్ కొట్టినా... మన ఎఫర్ట్ మనం కరెక్ట్ గా పెట్టాల్సిందే. అక్కడ పాతే అయినా మనకు కొత్తే కదా...

2ప్రశ్న... ఈ కథను ఎలా ఎంపిక చేసుకున్నారు..

రామ్ చరణ్... కథ వినగానే బాగా అనిపించింది. ప్రసాద్ గారు కథ తీసుకురాగానే ఎందుకు చేయకూడదు అనిపించింది. రొటీన్ గా అనిపించే హీరో సెంట్రిక్ మూవీ అయినా... మనకందరికీ నచ్చే కొత్త సబ్జెక్ట్. నాకు ధృవని అంతా అభినందిస్తారని నమ్మకముంది.

3ప్రశ్న...మగధీరలో ఒక్కసారే వంద మందిని చంపారు కదా.. దీంట్లలో ఒక్క విలన్ మాత్రమే ఉన్నట్టున్నాడు...

రామ్ చరణ్... ట్యాంక్ బండ్ మీద బుద్ధుడి విగ్రహంలా ఎప్పటికీ ఒకేలా ఉండలేం కదా... కొత్తదనం కోసం సాధ్యమైనంత భారం వేసుకునే సత్తా ఉంది. కథను బట్టి మనం కూడా మారాలి.. పాత సినిమాల ఇంపాక్ట్ లేకుండా చూసుకుంటూ.. భిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ పోవాల్సిందే..

4ప్రశ్న... తెలుగులో అరవింద్ ను ఎందుకు తీసుకున్నారు...అరవింద్ స్వామితో ప్రయాణం ఎలా సాగింది.

రామ్  చరణ్... అరవింద్ స్వామి గారితో చేయడం కొంత టెన్షన్ క్రియేట్ చేసింది. అతనికి అప్పటికే అలవాటైన సీన్స్... తన్ని ఒరువన్ లో చేసి ఉన్నారు. అయినా... ఆయన తెలుగు మేకింగ్ లో కొత్తగా కనిపించిన విధానం, ఆయన మేనరిజం అందరికీ నచ్చుతుంది. నిజానికి ఆయనతో చేసేటప్పుడు సీన్స్ లో ఇబ్బంది అనిపించేది. అయితే ధృవ షూటింగ్ సందర్భంగా ఆయనతో అనుబంధం బాగా పెరిగింది. ఆ కథ వినగానే ధృవలో మాకు కొత్తగా ఎవర్నో పెట్టాలనే ఆలోచన రాలేదు. ఆయన ఆ మూవీలో చేసిన యాక్షన్ చూసి మాకు అతనే కరెక్ట్ అనిపించింది. పైగా తెలుగు ఆడియెన్స్ ఆయన్ని చూసి చాలా రోజులైంది కదా...

5ప్రశ్న...కథ పూర్తిగా హీరోసెంట్రిక్ కదా. ఈ స్టోరీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు.

రామ్ చరణ్...

ఈ కేరక్టర్ గురించి తెలుసుకోగానే నేను కరెక్టే చేస్తున్నాననిపించింది. నా మీద ప్రసాద్ గారికి నమ్మకం అనిపించినప్పుడు... నన్ను నేను నమ్మడంలో తప్పులేదనిపించింది. ఒక సీనియర్ డిస్ట్రిబ్యూటర్ నాపై నమ్మకంతో నాదగ్గరికి వచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఎందుకు భయపడాలి అనిపించింది. ప్రతి యేటా మనం కొత్తగా ఉండే మంచి సబ్జెక్ట్ కావాలని కోరుకుంటాం.. కానీ.. అందుబాట్లో ఉన్న వాటి గురించి కూడా ఆలోచించాలి కదా..

6ప్రశ్న... ధృవ కోసం ప్రత్యేకంగా ఏమైనా హోం వర్క్ చేశారా...

రామ్ చరణ్... లేదు. నేను ప్రస్థుతం అలాంటి పరిస్థితుల్లో లేను. ధృవ కథ హీరో సెంట్రిక్ స్టోరీ. కథ పాతదే అయినా దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. నేను కొత్తగా తీసుకున్నా. అంతా కొత్తగా అనిపించింది.

7ప్రశ్న... ఫిజిక్ కొత్తగా అనిపిస్తోంది...

రామ్ చరణ్... బాడీ ఫ్రెష్ గా కనిపించిందని అడుగుతున్నారు కదా.. ఎప్పుడో చేయాల్సింది. కానీ ధృవ సినిమాకి కుదిరింది. నా సిక్స్ ప్యాక్ ప్రేక్షకులను అలరిస్తుంది.

8ప్రశ్న... రీమేక్ కోసం ఏమైనా సీన్స్ కానీ, కథ గానీ మార్చారా...

రామ్ చరణ్... కథ ఏమీ మార్చలేదు. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి కొన్ని మార్పులు చేసారు. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చేశారు.. సిద్ధార్థ్ అభిమన్యు కేరక్టర్ ను కొంత తగ్గించారు. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మనం మార్చుకోకపోతే కష్టం కదా..

9ప్రశ్న... ఓవర్సీస్ కలెక్షన్ 2 మిలియన్ దాటుతుందని సురేందర్ అంటున్నారు...

రామ్ చరణ్... యూఎస్ లో ప్రీమియర్ షోలు... అరవింద్ గారి ప్లాన్. ప్రమోషన్స్ అన్నీ డిఫరెంట్ గా చేశాం.

10ప్రశ్న... ధృవ రొటీన్ గా ఉండే హీరో సెంట్రిక్ మూవీ అని మీరే అంటున్నారు..మరి భిన్నమైన కథలతో రావాలనిపించలేదా...

రామ్ చరణ్... నాకు ఒరిజినల్ గా ఆ కేరక్టర్ నచ్చింది. కొన్నిమార్పులు చేసినా ఒరిజినల్ పాత్రలోనే చేసినా బాగానే ఉండేది. ఎందుకంటే అది ప్యూర్ కేరక్టర్. భిన్నమైన కథనా కాదా.. అంటూ ఎక్కవగా ఆలోచించకుండా..నేను కరెక్టే చేశాననిపించింది. ఆ కేరక్టర్ అలాంటిది. రియల్ ఎమోషన్స్ ఉన్న కేరక్టర్. నచ్చింది. చేశాను.

11ప్రశ్న... టైటిల్ లో ఉన్న 8 గురించి...

రామ్ చరణ్... కొన్ని రోజులు ఆగితే చెప్తా..

 

 

12ప్రశ్న... జంజీర్ తర్వాత చరణ్ మరోసారి ఇలాంటి పోలీస్ కేరక్టర్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించారా...

రామ్ చరణ్... తిరిగి పోలీస్ కేరక్టర్ చేయటచానిరకి కారణం కథలో ఉన్న గొప్పదనం. అంతకు మించి ఎక్కువ ఆలోచించలేదు.

 

13ప్రశ్న... రకుల్ ప్రీత్ సింగ్ నే ఎందుకు తీసుకున్నారు...

రామ్ చరణ్... ఇప్పుడున్న వాళ్లలో ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఇంకెవరున్నారు... రకుల్ బ్రిలియంట్ యాక్టర్. ఇప్పుడు టాప్ లీగ్ లో ఉంది. కొత్త హీరోయిన్లు రావాల్సిన అవసరం ఉంది.కానీ రకుల్ ఇప్పుడు బెటర్ ఆప్షన్ కదా.. మీరే చెప్పండి.

14ప్రశ్న... ధృవ సంగీతం గురించి...

రామ్ చరణ్... తన్ని ఒరువన్..సినిమాకు హిపాప్ తమిళ గొప్పగా అందించారు. అంతకంటే మంచి మ్యూజిక్ ధృవకు అందించాడు.

15ప్రశ్న... దర్శకుడు సురెందర్ రెడ్డి మళ్లీ చస్తే రీమేక్ జోలికి వెళ్లనంటున్నాడు...

రామ్ చరణ్... ఎవరి కథను వాళ్లు అనుకున్నట్లు చూపించాలని అనుకుంటారు. అయితే.. ధృవ రీమేక్ స్టోరీ కావడంతో సురెందర్ రెడ్డిపై కొంత ప్రెజర్ పడింది. అయినా నేను సూరిని.. ఫోర్స్ చేసేసరికి ధృవ చేశాడు. సొంత కథలా అనిపించదు కదా... ప్రెజర్ గా ఫీలవడం సహజమే.

16ప్రశ్న... మీ ఫిజిక్ గురించి మీ సతీమణి ఉపాసన ఏమైనా టిప్స్ ఇచ్చారా...

రామ్ చరణ్... ఉపాసన టిప్ ఏం ఇవ్వలేదు. నాకు ప్రత్యేకంగా ఫిట్ నెస్ ట్రెయినర్స్ ఉన్నందున తనకు ఆ అవసరం రాలేదు.

17ప్రశ్న... ధృవలో కామెడీ ఏమైనా ఉందా...

రామ్ చరణ్... ధృవ కంప్లీట్ ఎంటర్ టైనర్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. మీకు గుర్తుండే ఉంటుంది.. మగధీరలో కూడా కామెడీ లేదు, సరైనోడులో సైతం పెద్దగా కామెడీ లేదు. కానీ ఆ సినిమా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అలాంటి మూవీస్ లో కథలోనే గొప్పదనం ఉంటుంది. హై ఎమోషన్ ఉన్న సినిమాలు.. ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ధృవ కూడా ఆ తరహా చిత్రమే.

18ప్రశ్న... ధృవ తర్వాత ఏం చేయబోతున్నారు...

రామ్ చరణ్... సుకుమార్ తో చేస్తున్న రోల్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. నాన్న గారి ఖైదీ నెంబర్ 150 రిలీజ్ తర్వాత సుక్కు కాంబినేషన్ లో చేస్తున్న మూవీ షూటింగ్ మొదలు పెడతాం.

19ప్రశ్న... ఖైదీ నెంబర్ 150 నిర్మాతగా ప్రెజర్ ఏమైనా ఉందా...

రామ్ చరణ్... వినాయక్ గారి గురించి మనందరికీ తెలిసిందే. ఆయనుంటే మనమేం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఖైదీ నెంబర్ 150 షూటింగ్ రేపు పూర్తి కాబోతోంది. రేపు లాస్ట్ డే సాంగ్. ఆర్ ఎఫ్ సీలో జరుగుతుంది. ఆడియో ఫంక్షన్ కూడా నిర్వహిస్తాం.  కానీ ఎక్కడ అనేది ఇప్పుడే చెప్పలేను. అయితే.. క్రిస్ మస్ సీజన్ లో... చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇక నాన్నగారి మూవీ జాన్ 11 లేదా 12న రిలీజ్ చేస్తాం. ఖైదీ నెంబర్ 150లో నిన్నే సాంగ్ లో నేను షూటింగ్ లో కూడా పాల్గొన్నా.

 

20ప్రశ్న... డీ మానిటైజేషన్ ఎఫెక్ట్ పడిందా...

రామ్ చరణ్... పడకుండా ఉంటుందా.. అయితే అలవాటు కావటానికి కొంత సమయం పడుతుంది... అలవాటు చేసుకుంటున్నాం... ఒకప్పుడు ఎంతంటే అంత తీసేవాళ్లం, ఇప్పుడు 250 రూపాయలు పాకెట్ మనీలా తీసుకుని బయటికి వెళ్తున్నాం...

21ప్రశ్న... పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఎప్పుడు చేస్తున్నారు...

రామ్ చరణ్... ఆయన కమిట్ మెంట్స్, నా కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయ్యాక చేస్తాం.

22ప్రశ్న... ఇతర భాషల్లో చిత్రాలేమైనా ప్లాన్ చేస్తున్నారా...

రామ్ చరణ్... ప్రస్థుతానికి తెలుగు సినిమాలపైనే కాన్సెంట్రేట్ చేశాను.

23ప్రశ్న... హారర్ జోనర్ మూవీలేమైనా చేస్తారా...

రామ్ చరణ్... ఏ జోనర్ అయినా చేయడానికి రెడీ. కానీ మనకు ఆ కథ ఏ రేంజ్ లో సెట్ అవుతుందన్నదే పాయింట్.

PREV
click me!

Recommended Stories

Sivaji VS Anasuya: ఆ విధంగా అనసూయ రుణం త్వరలోనే తీర్చుకుంటా..ఈసారి ఇంకా ఘాటుగా శివాజీ కామెంట్స్
OTT: పూజ ఎవ‌రు? ఆ ప‌ర్సుతో ఆమెకు సంబంధం ఏంటి.? ఓటీటీని షేక్ చేస్తున్న మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్