
స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో నందమూరి బాలకృష్ణ అన్నీ తానై ఎన్టీఆర్ 100 సెలెబ్రేషన్స్ జరిపిస్తున్నారు. దీనికోసం టాలీవుడ్ ప్రముఖులందరినీ ఆహ్వానించారు.
మురళీమోహన్, జయప్రద, జయసుధ, కృష్ణవేణి లాంటి సీనియర్ నటీనటులు.. నాగ చైతన్య, సుమంత్, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ , మెగా పవర్ స్టార్ రాంచరణ్ లాంటి ఈ తరం నటులు హాజరయ్యారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ రాగానే పలకరించిన చంద్రబాబు తన పక్కనే మెగా పవర్ స్టార్ ని కూర్చోబెట్టుకున్నారు. చరణ్ తన ప్రసంగంలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 5వ తరగతి చదువుతున్నప్పుడు పురందేశ్వరి గారి అబ్బాయితో కలసి స్కేటింగ్ క్లాసులకు వెళ్ళేవాడిని. పురందేశ్వరి వాళ్ళ అబ్బాయి ఒకరోజు మా తాతగారి ఇంటికి వెళదాం రా అని పిలిచాడు. అప్పుడు సెక్యూరిటీ గురించి నాకు తెలియదు.
కానీ వెళ్లాను. ఇప్పుడు అందరూ చెబుతున్నట్లే ఆయన మార్కింగ్ వ్యాయామాలు పూర్తి చేసుకుని పెద్ద చికెన్ పెట్టుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. మాకు కూడా చికెన్ వడ్డించారు. నేను ఎన్టీఆర్ గారిని చూడడం అదే తొలిసారి అని రాంచరణ్ తెలిపారు. ఆయన మన స్థాయికి అందని వ్యక్తి.
ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి నటుడు, నటి ఎన్టీఆర్ గారిని తలచుకోకుండా ఉండరు. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ.. అప్పట్లోనే ఆయన సౌత్ ఇండియా సత్తాని దేశం మొత్తం చాటారు.. జై ఎన్టీఆర్ అంటూ రామ్ చరణ్ తన ప్రసంగాన్ని ముగించారు.