
యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి హ్యాండ్ ఇచ్చాడట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గౌతమ్ తో సినిమ చేయాల్సింది ఆ సినిమా కాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకీ గౌతమ్ సినిమాను చరణ్ ఎందుకు రిజెక్ట్ చేశాడు.
జెర్సీ సినిమాతో గౌతమ్ తిన్ననూరి పేరు మారుమోగింది. దాంతో వరుస ఆఫర్లు అతన్ని వెతుక్కుంటూ వచ్చాయిందు. గౌతమ్ టాలెంట్ చూసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అవకాశం ఇచ్చాడు. కథ ఒకే అయ్యింది. సినిమా కన్ ఫార్మ్ అయ్యింది. అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. కాని చివరకు ఇప్పుడు గౌతమ్ తో సినిమాను రామ్ చరణ్ కాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కారణం ఏంటంటే..?
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఇండియాన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ అయిపోయింది. చరణ్ ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరితో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించవలసిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు కేన్సిల్ అయినట్టుగా మేకర్స్ ప్రకటించారు.
గౌతమ్ తిన్ననూరి సినిమా ఫిక్స్.. ఇక షూటింగ్ స్టార్ట్ అవ్వడమే తరువాయి అనుకుంటే.. మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటీ అనుకుంటున్నారు టీమ్ జెర్సీ సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టాడు గౌతమ్. ఇదే కథతో బాలీవుడ్ లో హిందీ రీమేక్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా అక్కడ డిజాస్టర్ అయ్యింది. ఈలోగా చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అక్కడ దెబ్బ కొట్టింది. అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. గౌతమ్ తిన్ననూరి చరణ్ కు చెప్పిన కథ బాగా నచ్చింది. కాని ఇది పాన్ ఇండియా స్థాయి ఆడే సబ్జెక్ట్ కాకపోవడంతో చరణ్ ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది.
ఈ కారణంగానే చరణ్ - గౌతమ్ కాంబినేషన్ మూవీకి బ్రేక్ పడినట్టు సమాచారం. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ తరువాత శంకర్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు చరణ్. హిందీలో మంచి మార్కెట్ ఉన్న చరణ్... ఇలా లోకల్ సబ్జెక్ట్ తో సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్ లో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆలోచిస్తున్నాడట. అయితే శంకర్ తరువాత చరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడో అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తి కరంగా మారింది.
ఇక గౌతమ్ తిన్ననూరి ఇదే కథను విజయ్ దేవంకొండకు వినిపించడం.. ఆయన ఒకే చెప్పండ జరిగిపోయింది. దాంతో గౌతమ్ కు పెద్ద రిలీఫ్ వచ్చిందట. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మాతగా ... విజయ్ దేవరకొండతో చేయబోతున్నాడట గౌతమ్. త్వరలో అనౌన్స్ మెంట్ తో పాటు.. చాలా త్వరగా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.