#GameChanger రిలీజ్ డేట్ చెప్పిన దిల్ రాజు

Published : Dec 23, 2023, 07:32 PM IST
 #GameChanger రిలీజ్ డేట్ చెప్పిన దిల్ రాజు

సారాంశం

దిల్ రాజు... తాజాగా సలార్ చిత్రం ఫ్యాన్స్ షోకు వెళ్లారు. అక్కడ దిల్ రాజు ని ఓ అభిమాని ఈ చిత్రం అప్డేట్ అడుగుతూ రిలీజ్ డేట్ ప్రస్తావన తెచ్చారు. అందుకు  దిల్ రాజు స్పందిస్తూ ...

రామ్ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.  మరో ప్రక్క ఈ సినిమా ఎప్పటికి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది..ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ మాత్రం రావటం లేదు. ఈ నేపధ్యంలో దిల్ రాజుని ఓ మెగా అభిమాని ఇదే ప్రశ్న వేసారు. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అని. 

దిల్ రాజు... తాజాగా సలార్ చిత్రం ఫ్యాన్స్ షోకు వెళ్లారు. అక్కడ దిల్ రాజు ని ఓ అభిమాని ఈ చిత్రం అప్డేట్ అడుగుతూ రిలీజ్ డేట్ ప్రస్తావన తెచ్చారు. అందుకు  దిల్ రాజు స్పందిస్తూ సెప్టెంబర్ 2024 లో ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ఇక ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకూ హైదరాబాద్ లో జరగనుంది. ఆ తర్వాత న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ జరుపుకుని జనవరి 2 ను్ంచి మరో పది రోజులు వరకూ కంటిన్యూ షెడ్యూల్ జరపనున్నారు.   ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ, చిత్రీకరణ మాత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. 

రామ్ చరణ్ మాట్లాడుతూ...‘నేడు వస్తున్న సినిమాలకు.. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తి భిన్నమైన చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయి. శంకర్‌ గత చిత్రాలైన ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’.. సినిమాల ద్వారా చూపించిన సందేశాత్మక కథలకంటే... ఇది మరింత ఆసక్తికరమైన కథనంతో రానుంది. నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని తెలిపాడు.   

వాస్తవానికి ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోవాల్సింది..పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతుండటం,మధ్యలో కమలహాసన్ ఇండియాన్ 2 తో డైరెక్టర్ శంకర్ బిజీగా ఉండటం జరుగుతూ వచ్చింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఏ అంతరాయం లేకుండా పక్క షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారట టీమ్.  

అలాగే రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. RRR మూవీతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యిన ఈ  మెగా పవర్ స్టార్ ఈ చిత్రం తర్వాత   చేస్తున్న మూవీ "గేమ్ ఛేంజర్". భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన  శంకర్  ఈ చిత్రం..అంతకు మించి అనే స్దాయిలో రూపొందిస్తున్నాడని వినికిడి.  పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.   రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో చరణ్‌ భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, అంజలి, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు. తిరు ఛాయాగ్రాహకుడు.

PREV
click me!

Recommended Stories

రెండో భార్యతో కూడా దర్శకుడు విడాకులు ? మొన్న తమ్ముడు, ఇప్పుడు అన్న.. ఫోటోలు డిలీట్ చేసిన భార్య
Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ..