రామ్ చరణ్ -ఉపాసన చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా, నెటిజన్ల ప్రశంసలు, భారతీయులు గర్వించే పని చేసిన మెగా జంట

Published : Mar 15, 2023, 11:47 AM IST
రామ్ చరణ్ -ఉపాసన చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా, నెటిజన్ల ప్రశంసలు, భారతీయులు గర్వించే పని చేసిన మెగా జంట

సారాంశం

ఆస్కార్ వేడుకల్లో తళుక్కున మెరిసారు రామ్ చరణ్, ఉపాసన. ఆస్కార్ ఈవెంట్ లో భారతీయత ఉట్టిపడేలా డ్రెస్సింగ్ తో హడావిడి చేశారు. ప్రతీ విషయంలో భారతీయత కనిపించేలా ప్రవర్తించారు మెగా జంట. అంతే కాదు ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఈ కపుల్ అందరికి షాక్ ఇచ్చారు.   

ఆస్కార్ వేడుకల్లో రామ్ చరణ్ తో పాటు సందడి చేశారుఉపాసన. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో మెరిసారు. ప్రస్తుతం ప్రగ్నెంట్ గా ఉన్న ఆమె..చరణ్ వెంటే ఉంటూ వస్తోంది. తన భర్తతో మధుర క్షణాలు ఆస్వాదిస్తోంది. ఇక ఈ జంట రీసెంట్ గా ఓ అమెరికన్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు మెగా కపుల్. తమ పర్సనల్ విషయాలతో పాటు.. సినిమాలు, ఉపాసన ప్రొఫిషన్ గురించి కూడా చర్చించుకున్నారు. ఈక్రమంలో చరణ్ , ఉపాసన చెసిన పనికి భారతీయులంతా ఫిదా అవుతున్నారు. 

ఇదే ఇంటర్వ్యూలో చిన్న సీతారామ విగ్రహాలు చూపించారు చరణ్ దంపతులు. ప్రపంచంలో ఏ మూలకి వెళ్లిన నేను, నా భార్య ఈ విగ్రహాలని తీసుకు వెళ్తాము. ఈ చిన్న టెంపుల్ సెటప్ మమ్మల్ని మా సంప్రదాయాలతో, మా దేశంతో కనెక్ట్ చేస్తుంది అని నమ్ముతాం.. అంటూ రామ్ చరణ్  చెప్పుకొచ్చాడు. దాంతో ఈ ఇంటర్వ్యూ చూసిన ఇండియన్స్ ఫిదా అవుతున్నారు. అమెరికన్స్ మాత్రం చరణ్ కు తన దేశం పట్ల ఉన్న భక్తిని తెగ పొగిడేస్తున్నారు.  ఇక రీసెంట్ గా కూడా ఒక అమెరికన్ ఇంటర్వ్యూలో కూడా అయ్యప్ప దీక్ష యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేశాడు రామ్ చరణ్. ఇలా తన దేశం పట్ట ప్రేమని భక్తిని చాటుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 

తన నటనతో ఇండియన్ సినిమాని దాటుకుని  ఇంటర్నేషనల్ లెవెల్ లో  గుర్తింపు పొందడమే కాకుండా.. మన కల్చర్ ని కూడా ఇతర దేశాలకు తెలిసేలా చేస్తున్న రామ్ చరణ్ దంపతును నెటిజెన్లు  అభినందిస్తూ అభినందిస్తున్నారు. కామంట్లు లైక్ ల రూపంలో హార్షం వ్యక్తం చేస్తునారు.  ఇక ఆస్కార్ ఘనతను సాధించిన ట్రిపుల్ ఆర్ టీమ్.. చిన్నగా హైదరాబాద్ చేరుతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో అడుగు పెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, చిన్నగా ఒక్కొక్కరు ఇల్లు చేరుతున్నారు. 

ఇక రామ్ చరణ్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాను  దిల్ రాజు భారీ బడ్జెట్ తో  నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో చరణ్ జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు  సందర్భంగా ఈసినిమానుంచి  టైటిల్ తో కూడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే ఈసినిమాకు  CEO, సేనాని, సైనికుడు ఇలా రకరకాల టైటిల్స్ పరిశీలిస్తున్నారు మేకర్స్. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి