హ‌నుమాన్ దీక్ష తీసుకున్న నితిన్.. హిట్ కోసమా..?

By Udaya DFirst Published 21, Feb 2019, 4:46 PM IST
Highlights

గత కొంతకాలంగా నితిన్ సినిమాలు(‘లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం’) భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావటం లేదు. రీసెంట్ గా వచ్చిన శ్రీనివాస కళ్యాణం మరీ దారణంగా డిజాస్టర్ అయ్యింది. 

గత కొంతకాలంగా నితిన్ సినిమాలు(‘లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం’) భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావటం లేదు. రీసెంట్ గా వచ్చిన శ్రీనివాస కళ్యాణం మరీ దారణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఆయన ఆచి, తూచి అడుగులు వేస్తున్నారు. రీసెంట్ గా భీష్మ అనే చిత్రం కథ ఓకే చేసి ఆ ప్రాజెక్టుపై తన దృష్టి పెట్టారు. 

అంతేకాకుండా తనకు భగవంతుడు అండదండలు కూడా కావాలని హ‌నుమాన్ దీక్ష తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. 

నితిన్ హ‌నుమాన్ దీక్ష తీసుకున్న‌ట్టు ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. దీక్ష వ‌ల‌న తాను చాలా శాంతంగా ఉన్న‌ట్టు పేర్కొన్నాడు. ఉద‌యాన్నే 5 గంటలకి లేచిన త‌న‌కి శ్రీ ఆంజ‌నేయం సాంగ్స్‌తో డే స్టార్ట్ అవుతుంద‌ని అన్నాడు. ఆ త‌ర్వాత పూజా కార్య‌క్ర‌మాలతో బిజీ కానున్న‌ట్టు స్ప‌ష్టం చేశాడు. ఆధ్యాత్మిక‌త‌తో కూడిన వైబ్స్ నాలో స‌రికొత్త ఉత్సాహం ఇస్తుంద‌ని నితిన్ త‌న ట్వీట్‌లో తెలిపాడు. 

‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఎఫ్2 చిత్రం సీక్వెల్‌లో రవితేజకి బదులుగా నితిన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై దిల్ రాజు మరింత స్పష్టతను ఇవ్వాల్సి ఉంది.

It feels so blessed and very peaceful being in Lord Hanuman Deeksha🙏🏻. Wakin up at 5 AM and startin my day with beautiful Sree Anjaneyam songs followed by poojas.All these Divine Vibes are so spiritual refreshing. Sree anjaneyam🙏🙏 pic.twitter.com/lMuN3PpSe3

— nithiin (@actor_nithiin)
Last Updated 21, Feb 2019, 4:46 PM IST