సూపర్ స్టార్ మహేష్ తో రకుల్ బ్యాక్ టు బ్యాక్

Published : Apr 18, 2017, 11:00 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
సూపర్ స్టార్ మహేష్ తో రకుల్ బ్యాక్ టు బ్యాక్

సారాంశం

రకుల్ ప్రీత్ సింగ్ కు మహేష్ బాబు సరసన మరో గోల్డెన్ ఆఫర్ ఇప్పటికే మురుగదాస్,మహేష్ ల సినిమాలో మహేష్ సరసన రకుల్ తాజాగా కొరటాల శివ, మహేష్ తదుపరి ప్రాజెక్ట్ లోనూ రకుల్ క ఛాన్స్

అనతి కాలంలోనే టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని దూసుకెళ్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న రకుల్ తాజాగా ఓ గోల్డెన్ ఆఫర్ సొంతం చేసుకుంది. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించిన ఈ పంజాబీ బ్యూటి, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మరోసారి నటించే చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మహేష్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పలు కోలీవుడ్ మూవీస్ తోనూ బిజీగా ఉన్న రకుల్ మరిన్ని సినిమాలకు కమిట్ అవుతోంది.

 

తాజాగా మహేష్ తదుపరి చిత్రంలోనూ రకుల్ నే హీరోయిన్ గా ఫైనల్ చేశారని వినిపిస్తోంది. స్పైడర్ షూటింగ్ పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమాను ప్రారంభించనున్నాడు ప్రిన్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీస్ కైరా అద్వానీ, దిశాపటానీ లాంటి వాళ్లను ట్రై చేసినా.. ఫైనల్ గా రకుల్ కే ఫిక్స్ అయ్యారట. రామ్ చరణ్ తోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించిన రకుల్, ఇప్పుడు మహేష్ తోనూ అదే ఫీట్  రిపీట్ చేయబోతోంది.

PREV
click me!

Recommended Stories

2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?
సమంత, అఖిల్ అక్కినేనితో పాటు 2025లో పెళ్లి చేసుకున్న 10 జంటలు ఎవరో తెలుసా?