పాకిస్థాన్ జెండాను ఛాతిపై కప్పుకున్న నటి!

Published : May 09, 2019, 12:15 PM IST
పాకిస్థాన్ జెండాను ఛాతిపై కప్పుకున్న నటి!

సారాంశం

బాలీవుడ్ తార రాఖీ సావంత్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. మీటూ ఉద్యమం సమయంలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

బాలీవుడ్ తార రాఖీ సావంత్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. మీటూ ఉద్యమం సమయంలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తరచూ సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచేది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

దానికి కారణం ఆమె పాకిస్థాన్ జెండా ముందు నిల్చొని ఫోటోలకు ఫోజివ్వడమే.. పాకిస్థాన్ జెండాను ఛాతిపై కప్పుకుని ఆమె తీయించుకున్న ఫోటోపై ఫ్యాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ జెండాతో భారతీయురాలైన రాఖీ సావంత్ ఫోటోలేంటని ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాఖీని తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు.

దీంతో ఆ విధంగా ఎందుకు ఫోటోలు దిగాల్సి వచ్చిందనే విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలిపింది రాఖీ సావంత్. తను నటిస్తోన్న తాజా చిత్రంలో పాకిస్థాన్ యువతిగా నటిస్తున్నాని.. ఆ సినిమాకు సంబంధించి సెట్ లోని ఫోటోలనే తాను పోస్ట్ చేశానని తెలిపింది. 'ఐ లవ్ మై ఇండియా' అంటూ చెప్పడంతో వివాదం కాస్త చల్లారింది. 

 

PREV
click me!

Recommended Stories

Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ