నటి రహస్య వివాహం.. రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోన్న మాజీ ప్రియుడు!

Published : Aug 13, 2019, 01:28 PM IST
నటి రహస్య వివాహం.. రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోన్న మాజీ  ప్రియుడు!

సారాంశం

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ రహస్యంగా వివాహం చేసుకోవడంపై ఆమె మాజీ ప్రియుడు దీపక్‌ ఖలాల్‌ షాక్‌ అయ్యారు. దీపక్‌తో తన వివాహం జరగనుందని కొన్ని నెలల క్రితం రాఖీ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన్ను వివాహం చేసుకోవడం లేదని సోషల్‌మీడియాలో పేర్కొన్నారు.

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన రెండు, మూడు రోజులకు గానీ అమ్మడు విషయాన్ని బయట పెట్టలేదు. అయితే ఈ పెళ్లిపై రాఖీ మాజీ ప్రియుడు దీపక్ ఖలాల్ షాక్ అయ్యారు. దీపక్ తో తన వివాహం జరగనుందని కొన్ని నెలల క్రితం రాఖీ సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఆ తరువాత ఆయన్ని పెళ్లి చేసుకోవడం లేదని మరో పోస్ట్ పెట్టింది. కొన్ని రోజుల క్రితం ఈమె ఓ ఎన్నారైను రహస్యంగా వివాహం చేసుకొని షాక్ ఇచ్చింది. దీని తరువాత మీడియాతో మాట్లాడిన ఆమె.. తన భర్త యూకే వెళ్లిపోయారని.. తనకు వీసా రావాల్సివుందని.. ఆ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆయన దగ్గరకి వెళ్తానని.. అక్కడే సెటిల్ అవుతామని చెప్పింది.

ఈ క్రమంలో రాఖీ తనను మోసం చేసిందంటూ దీపక్ ఇన్స్టాగ్రామ్ ఓ వీడియోను షేర్ చేశాడు. తనకు నాలుగు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. నాలుగు రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఆమె జీవితాన్ని నాశనం చేశానని బెదిరించారు. అయితే దీపక్ వ్యాఖ్యలను ఖండించిన రాఖీ అతడిపై మండిపడింది.

ఈ క్రమంలో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తన భర్త గురించి తప్పుగా మాట్లాడడాన్ని భరించలేని రాఖీ.. దీపక్ ఖలాల్ ని తిట్టిపోసింది. మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో..!


 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు