'రాక్షసుడు' టీజర్.. బెల్లంకొండ హిట్టు కొడతాడా..?

Published : Jun 01, 2019, 10:47 AM ISTUpdated : Jun 01, 2019, 10:52 AM IST
'రాక్షసుడు' టీజర్.. బెల్లంకొండ హిట్టు కొడతాడా..?

సారాంశం

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న నూతన చిత్రం 'రాక్షసుడు'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపధ్యంలో సాగే చిత్రమిది. 

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న నూతన చిత్రం 'రాక్షసుడు'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపధ్యంలో సాగే చిత్రమిది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'రాచ్చసన్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. 

తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఇందులో విజువల్స్, డైలాగ్స్, నేపధ్య సంగీతం మొత్తం కూడా ఒరిజినల్ సినిమాను తలపిస్తోంది. ఇప్పటికే తమిళ చిత్రాన్ని చూసిన వారికి టీజర్ ఎగ్జైటింగ్ గా అనిపించకపోయినా.. కొత్తగా చూసేవారికి మాత్రం కచ్చితంగా నచ్చేలా రూపొందించారు.

ఈ సినిమాలో బెల్లంకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. వరుస హత్యలు, ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేసి చంపే సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి సినిమాలో హీరో ఏం చేశాడనేదే కథ.

ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు బెల్లంకొండ. రమేష్ వర్మ డైరెక్టర్ చేస్తోన్న ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించారు. జూలై 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

PREV
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?