రజినీకాంత్ కూలీ సినిమా పేరు మారింది, కొత్త టైటిల్ ఏంటో తెలుసా?

Published : Jun 24, 2025, 11:59 PM IST
Rajinikanth

సారాంశం

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ. ఈసినిమా టైటిల్ ను సడెన్ గా మార్చేశారు. ఇంతకీ కొత్త టైటిల్ ఏంటి? అసలు ఎందుకు ఈ సినిమా టైటిల్ మార్చబోతున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ 171వ సినిమా కూలీ. ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ దళపతి, కమల్ హాసన్‌లతో మాస్ హిట్ సినిమాలు తీసిన లోకేష్ కనకరాజ్, రజినీకాంత్‌తో మొదటిసారి కలిసి పనిచేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. కూలీ సినిమా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా విడుదలకు ఇంకా 50 రోజులే ఉంది. దీంతో సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు వరుసగా రిలీజ్ చేస్తున్నారు మూవీ టీమ్.

కూలీ సినిమాలోని మొదటి పాట విడుదల కానుంది. చిక్కిటు అంటూ మొదలయ్యే ఈ పాటకు అనిరుధ్ సంగీతం అందించగా, తమిళంలో ఈ పాటను టి.రాజేందర్ పాడారు. డాన్స్ మాస్టర్ శాండీ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట లిరికల్ వీడియోలో అనిరుధ్, టి.రాజేందర్ కూడా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పాటలో ఈ ఇద్దరు కలిసి డాన్స్ చేశాని సమాచారం. కూలీ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. అన్ని భాషల్లోనూ కూలీ పేరుతోనే సినిమా విడుదలవుతుందని ప్రకటించారు. కాని ఒక్క భాషలో మాత్రం ఈసినిమా టైటిల్ మార్చబోతున్నారు.

కూలీ సినిమా పేరు మార్పు

కూలీ సినిమా హిందీ వెర్షన్ టైటిల్‌ని మార్చారు. హిందీలో ఈ సినిమా మజదూర్ పేరుతో విడుదలవుతుందని ప్రకటించారు. ఎందుకంటే హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన కూలీ అనే క్లాసిక్ హిట్ సినిమా ఉంది. ఇంకా 2020లో వరుణ్ ధావన్ నటించిన కూలీ నెంబర్ 1 అనే సినిమా కూడా విడుదలైంది. ఇలా ఒకే పేరుతో రెండు సినిమాలు వచ్చేసాయి కాబట్టి రజినీ నటించిన కూలీ సినిమా హిందీలో మజదూర్ పేరుతో విడుదలవుతుందని ప్రకటించారు.

కూలీ సినిమాలో రజినీకాంత్‌తో పాటు శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, నాగార్జున వంటి పెద్ద స్టార్ కాస్ట్ నటించింది. బంగారం దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందించారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమా ఈ ఏడాది కోలీవుడ్‌లో 1000 కోట్లు వసూలు చేసుందన్న నమ్మకంతో ఉన్నారు. మరి ఈమూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?