Thalaivar 170 షూటింగ్ షురూ.. తిరువనంతపురంలో పూజా కార్యక్రమం.. దిమ్మతిరిగిపోయే డిటేయిల్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)  170వ చిత్రం ఈరోజు ప్రారంభమైంది. గ్రాండ్ గా పూజా కార్యక్రమంతో షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా మరిన్ని అదిరిపోయే అప్డేట్స్ అందించారు. 
 

Google News Follow Us

తమిళ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వస్తున్న భారీ ప్రాజెక్ట్ Thalaivar 170. 
లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో రజినీకాంత్ నాలుగోసారి చేస్తున్న చిత్రమిది కావడం విశేషం. Thalaivar 170గా గతంలోనే అనౌన్స్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ రోజు సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో గ్రాండ్ గా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో చిత్ర యూనిట్ పాల్గొంది. 

ఈ సందర్భంగా దిమ్మతిరిగే అప్డేట్స్ అందించారు. సినిమా ప్రారంభం సందర్భంగా చిత్రంలో నటించబోయే స్టార్ కాస్ట్ వివరాలను వెల్లడించారు. ఇప్పటికే Thalaivar 170  నటీనటులపై మేకర్స్ అప్డేట్ అందిస్తూ వస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati), అలాగే రితికా సింగ్ (Ritika Singh), మంజు వారియర్ (Manju Warrier), దుషార విజయన్ (Dushara Vijayan) నటిస్తున్నట్టు చిత్రంలో జాయిన్ అయినట్టు స్పెషల్ పోస్టర్ లను విడుదల చేశారు. 

ఇక ఈ చిత్రం ఈరోజు గ్రాండ్ గా ప్రారంభమవడంతో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అందించారు. ఈ చిత్రంలో మరో ఇద్దరు బిగ్ స్టార్స్ కూడా జాయిన్ అయినట్టు ప్రకటించారు. బాలీవుడ్ బిగ్ బీబీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ (Fahad Faasil) కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని  చెప్పారు. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు అందిన అప్డేట్స్ తో  సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థమవుతోంది. ఈ బిగ్ ప్రాజెక్ట్ పై మున్ముందు మరిన్ని డిటేయిల్స్ కూడా అందిస్తామని మేకర్స్  తెలిపారు. 

ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ (TJ Gnanavel) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతుండటంతో మరింత హౌప్ క్రియేట్ అయ్యింది. చివరిగా తమిళ స్టార్ హీరో సూర్యతో ‘జై భీమ్’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రశంసలు పొందారు. ఆస్కార్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రజినీకాంత్ 170వ చిత్రాన్ని తెరకెక్కించబోతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.