ఆపరేషన్ సిందూర్ పై రజనీకాంత్ గూస్ బంప్స్ తెప్పించే కామెంట్స్.. జూ.ఎన్టీఆర్, సాయిధరమ్ తేజ్ రియాక్షన్

Published : May 07, 2025, 10:47 AM IST
ఆపరేషన్ సిందూర్ పై రజనీకాంత్ గూస్ బంప్స్ తెప్పించే కామెంట్స్.. జూ.ఎన్టీఆర్, సాయిధరమ్ తేజ్ రియాక్షన్

సారాంశం

ఆపరేషన్ సిందూర్‌పై రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్, సాయిధరమ్ తేజ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ భారత సైన్యానికి మద్దతు ప్రకటించారు.  

ఏప్రిల్ 22న పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. ఉగ్రవాదుల చర్యకు ప్రతీకారం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఊహించిన విధంగానే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఈ ఎయిర్ స్ట్రైక్ ను ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో నిర్వహించారు. 

కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని అత్యంత ఖచ్చితత్వంతో వైమానిక దాడులు చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులతో ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చాలామంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. 9చోట్ల ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దళం ఈ దాడులు నిర్వహించింది. 

దీంతో దేశం మొత్తం ప్రజలు భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ వారి ధైర్య సాహసాలని ప్రశంసిస్తున్నారు. పాల్గాం దాడికి న్యాయం జరిగింది అంటూ పోస్టులు పెడుతున్నారు. అదేవిధంగా సినీ తారలు కూడా ఆపరేషన్ సిందూర్ పై స్పందిస్తున్నారు. 

ఇప్పటికే చిరంజీవి, కాజల్ అగర్వాల్, తాప్సి, అనుపమ్ ఖేర్, రితేష్ దేశ్ముఖ్ లాంటి సెలబ్రిటీలు ఇండియన్ ఆర్మీ ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా ట్విట్టర్లో ఆపరేషన్ సిందూర్ పై తమ స్పందన తెలియజేశారు.

ఆర్మీ క్షేమం కోసం ప్రార్థిస్తున్నా: జూ.ఎన్టీఆర్   

ఇండియన్ ఆర్మీకి మరింత శక్తి చేకూరాలి. వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నా. ఆపరేషన్ సింధూర్.. జైహింద్ అని జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. 

 

సహించే ప్రసక్తే లేదు : సాయి ధరమ్ తేజ్ 

ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు అని అర్థం వచ్చేలా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పోస్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీ శక్తిని తెలియజేస్తూ ఎమోజీలు పెట్టారు.

యోధుల పోరాటం షురూ: రజనీ 

'యోధుల పోరాటం మొదలైంది. మిషన్ పూర్తయ్యే వరకు వారిని అడ్డుకునే వారు లేరు. దేశం మొత్తం మీ వెంట ఉంది. ఆపరేషన్ సిందూర్.. జైహింద్ ' అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ ట్వీట్ ని పీఎంవో ఇండియా, హెచ్ ఎం వో ఇండియా కు ట్యాగ్ చేశారు. ఆపరేషన్ సిందూర్ పై తలైవా రజనీ ట్వీట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా