ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో సెలబ్రిటీలు, ప్రజలు భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి స్పందించారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా చేపట్టింది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ కలసి తొమ్మిదిచోట్ల ఉగ్రస్తావరాలని మెరుపు దాడితో ధ్వంసం చేశారు. ఈ దాడిలో చాలామంది ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. దీంతో దేశం మొత్తం భారత సైన్యానికి జేజేలు కొడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ఇది సరైన ప్రతీకారం అంటూ పోస్ట్లు పెడుతున్నారు.
అర్థరాత్రి 1.44 గంటలకు భారత ఆర్మీ ఈ ఆపరేషన్ ని భీకరమైన స్థాయిలో లాంచ్ చేసింది. ఆపరేషన్ విజయవంతం అయినట్లు భారత ఆర్మీ ప్రకటించింది. దీంతో దేశం మొత్తం సెలబ్రిటీలు ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ కొడుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. మరోసారి ఇండియన్ ఆర్మీ సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ పై మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సింపుల్ గా జైహింద్ అని పోస్ట్ చేసిన చిరంజీవి భారత సైన్యాన్ని పరోక్షంగా అభినందించారు.
బేబీ చిత్ర నిర్మాత ఎస్ కే ఎన్ కూడా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను అభినందించారు. 'జైహింద్.. మనందరి ప్రార్థనలు భారత సైన్యానికి తోడుగా ఉంటాయి'అని ట్వీట్ చేశారు.
నటి కాజల్ అగర్వాల్, మైత్రి బోధ్ పరివార్ సంస్థ ద్వారా భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ సందేశాన్ని షేర్ చేశారు. సీనియర్ నటుడు పరేశ్ రావల్ ఆపరేషన్ సిందూర్ పై ఎక్స్ ద్వారా స్పందించారు.
నటి తాప్సీ పన్ను కూడా స్పందించారు. హేంకుంత్ ఫౌండేషన్ చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై పోస్ట్ షేర్ చేశారు. అత్యవసర సమయాల్లో ఈ సంస్థ సహాయక చర్యలు చేపడుతుంది.
తెలుగు నటి బిందు మాధవి కూడా ఈ ఆపరేషన్‌పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.