ఆ ఇద్దరి డైరక్టర్స్ తో రజనీ డిస్కషన్స్,ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో

Published : Jan 20, 2023, 12:56 PM ISTUpdated : Jan 20, 2023, 12:57 PM IST
ఆ ఇద్దరి డైరక్టర్స్ తో రజనీ డిస్కషన్స్,ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో

సారాంశం

  ఇద్దరు దర్శకులతో  రజనీ కాంత్... కథలు  విని డిస్కషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఆ డైరక్టరల్స్ లో ఒకరని ఫైనల్ చేసి తన 170 సినిమాకు డైరక్షన్ చేయమని చెప్తారు. 

సూపర్‌స్టార్ తలైవా రజినీకాంత్ తో సినిమా చేయాలని ప్రతీ దర్శకుడి కల. దాంతో ఆయనకు కథ చెప్పి ఒప్పించాలని అందరూ ట్రై చేస్తూంటారు. మరో ప్రక్క రజనీకాంత్ ఇప్పుడు ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న జైలర్ చిత్రం షూటింగ్ కూడా పూర్తి కావస్తోంది. రజినీ 169వ చిత్రమిది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కుతోంది. తదుపరి రజినీకాంత్ ఏ సినిమాను డైరెక్ట్ చేస్తార నే దానిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల మేరకు తలైవర్ ఓ సెన్సేషనల్ యంగ్  డైరెక్టర్‌తో సినిమా చెయ్యాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు దర్శకులతో ఆయన కథలు విని డిస్కషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఆ డైరక్టరల్స్ లో ఒకరని ఫైనల్ చేసి తన 170 సినిమాకు డైరక్షన్ చేయమని చెప్తారు. వాళ్లిద్దరు ఎవరంటే...

తమిళ సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన ప్రదీప్ రంగనాధన్ కథ ఆయన విన్నారు. ఫన్ జానర్ లో నడిచే ఆ కథను ఆయన ఇష్టపడ్డారు. అయితే ఇంకా ఓకే చెప్పలేదని తెలుస్తోంది. మరో ప్రక్క జై భీమ్ డైరక్టర్ టిజే జ్ఞానవేల్ ..ఓ సోషలా్ రిలెవెంట్ సబ్జెక్ట్ తో ఆయన్ని కలిసి ఒప్పించారని చెప్తున్నారు. వీరిద్దరిలో ఒకరితో రజనీ సినిమా ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు.

మరో ప్రక్క రజనీకాంత్ ...మణిరత్నంతో సినిమా చేయాలని ఉత్సాహం చూపిస్తున్నాడంటున్నారు.  21 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.రజినీకాంత్‌, మణి రత్నం కాంబినేషన్‌ లో గతంలో  దళపతి వంటి క్లాసిక్ మూవీ రూపొంది సూపర్ హిట్టైన  విషయం తెలిసిందే. ఆ సినిమా 1991లో విడుదలైంది. అప్పటి నుంచి రజినీకాంత్ - మణిరత్నం కాంబినేషన్ ‌లో సినిమా రానే లేదు.

  రీసెంట్‌ గా మణిరత్నం ఓ స్టోరీ లైన్‌ను రజినీకాంత్‌కి వినిపించార ట. ఆయనకు చాలా బాగా నచ్చేసింది. వెంటనే పూర్తి కథను సిద్ధం చేసి వినిపించమన్నారని తమిళ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్‌. ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్ ‌లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 తెరకెక్కాల్సి ఉంది. ఆ సినిమా పూర్తయిన తర్వాత రజినీకాంత్‌ తో మణిరత్నం సినిమాను చేస్తారంటున్నారట.. ఇక ఈ లోగా రజినీకాంత్ తన జైలర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటారు. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం