నయనతారకు రజనీ సీరియస్ వార్నింగ్

Published : Jun 13, 2019, 06:18 PM IST
నయనతారకు రజనీ సీరియస్ వార్నింగ్

సారాంశం

రజనీకాంత్ కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రొపిషనల్ విషయాల్లో ఆయన చాలా నిక్కిచ్చిగా ఉంటారు. అందుకే ఆయన సౌతిండియా సూపర్ స్టార్ అయ్యారు. వృత్తి వ్యవహారాల్లో తన సొంత ఇంట్లో వాళ్లను , తను ఎంతో ఇష్టపడే కూతుళ్లను సైతం వేలు పెట్టనివ్వరు. 

రజనీకాంత్ కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రొపిషనల్ విషయాల్లో ఆయన చాలా నిక్కిచ్చిగా ఉంటారు. అందుకే ఆయన సౌతిండియా సూపర్ స్టార్ అయ్యారు. వృత్తి వ్యవహారాల్లో తన సొంత ఇంట్లో వాళ్లను , తను ఎంతో ఇష్టపడే కూతుళ్లను సైతం వేలు పెట్టనివ్వరు. అదే సమయంలో తోటి నటీనటీలతో చాలా జోవియల్ గా ఉంటారు. వాళ్లకు చాలా గౌరవం ఇస్తూంటారు. ముఖ్యంగా నయనతార అంటే ఆయనకు చాలా గౌరవం. తన కెరీర్ ప్లాఫ్ ల్లో ఉన్నప్పుడు సూపర్ హిట్ ఇచ్చిన చంద్రముఖిలో ఆమే హీరోయన్ కావటం ఓ కారణం. 

 దాంతో నయనతారం తన బోయ్ ఫ్రెండ్ విఘ్నేష్ ని రజనీ కు పరిచయం  చేసింది. రజనీతో సినిమా చేయాలని విఘ్నేష్ చిర కాల కోరిక. ఆ విషయం రజనీకు చెప్పారు. ఆయన చూద్దాం. మంచి కథ దొరికితే అని క్యాజువల్ గా చెప్పారట. ఆ తర్వాత నయనతార  ఎప్పుడు కథ వింటారు..విఘ్నేష్ మంచి దర్శకుడు అంటూ రజనీకు ఖాళీ దొరికినప్పుడల్లా చెప్తోందిట. అంతేకాక విఘ్నేష్ డైరక్ట్ చేసిన సినిమాల డీవిడిలు సైతం ఇచ్చి చూడమందిట. అయితే రజనీకు ఇప్పటికిప్పుడు విఘ్నేష్ తో సినిమా చేసే ఆలోచన అసలు లేదట. దాంతో ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదట. అయితే ఈ మధ్యన మరోసారి నయనతార అదే టాపిక్ తెచ్చిందిట. 

ఇది గమనించిన రజనీకాంత్ సీరియస్ అయ్యారట. ప్రొఫెషనల్ విషయాల్లోకి పర్శనల్ లైఫ్ ని తేవద్దని చెప్పారట. నాకు అంతగా విఘ్నేష్ తో సినిమా చెయ్యాలనిపిస్తే పిలిపించి చేస్తాను. నాకు ఎవరి రికమండేషన్ అవసరం లేదు. అలాగే నువ్వు కూడా అలా చీటికి మాటకి పదే పదే అతని గురించే చెప్పకు. మాకు ఇబ్బంది గా ఉంటుందని సున్నితంగా చెప్తూనే, సీరియస్ గా హెచ్చరించారట. దాంతో నయనతార మొహం మాడిపోయిందిట. ఏదో తన బోయ్ ఫ్రెండ్ పీకుతున్నాడని ఇలా అడిగితే తనకు రివర్స్ అయ్యిందని బాధ పడిందిట. 

 

PREV
click me!

Recommended Stories

వెంకటేష్ రీమేక్ సినిమాలు మాత్రమే ఎక్కువగా చేయడానికి కారణం ఏంటి? వెంకీ రీమేక్ మూవీస్ లిస్ట్ లో బ్లాక్ బస్టర్స్
Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు, బాక్సాఫీసు వద్ద దుమారం.. బాలయ్య టాప్‌ 5 ఓపెనింగ్స్