
రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఈవెంట్‌లో ఆయన రోజా, మురళీ మోహన్, అలీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, అలీ స్వయంగా స్పందిస్తూ పరిస్థితిని సున్నితంగా సమన్వయపరిచారు.
ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్ర ప్రసాద్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై మాట్లాడిన ఆయన "నా మాట తీరును అలీ సీరియస్‌గా తీసుకోలేదు. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని అతను కూడా చెప్పాడు. అయినా, ఎవరో కావాలని దీనిని పెద్దది చేస్తున్నారు. మేమంతా ఒకరికొకరం ప్రేమతో ఉన్నాం. అలాంటి అనుబంధాలు లేకుంటే ఇంత కాలం కలిసి ప్రయాణించలేము అని అన్నారు.
అలాగే, అలీ తనకు మళ్లీ ఫోన్ చేసి జరిగిందన్నీ మర్చిపో అని చెప్పినట్టు వెల్లడించారు. ఏదేమైనా జరిగినదానికి నేను చాలా హర్ట్ అయ్యాను అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇకపై జీవితం అంతా ఎవరినైనా ‘మీరు’ అనే పిలుస్తాను. ఎప్పుడూ ‘నువ్వు’ అనే పదం వాడను. ఇది నేను ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకున్న నేర్పు. నేను మాట ఇస్తున్నాను... ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరినీ గౌరవంగా పిలుస్తాను" అని స్పష్టంగా చెప్పారు.
ఈ వ్యాఖ్యలతో రాజేంద్ర ప్రసాద్ తన భవిష్యత్ వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ స్పందన సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. కాగా, ఇండస్ట్రీలో మాత్రం ఈ వివరణపై మిశ్రమ స్పందన రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్టిపూర్తి సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తో నడుస్తోంది. ఈ సినిమా ఈవెంట్ లో కూడా