రాజశేఖర్ 'కల్కి' టీజర్!

Published : Feb 04, 2019, 02:59 PM IST
రాజశేఖర్ 'కల్కి' టీజర్!

సారాంశం

'గరుడ వేగ' చిత్రంతో భారీ హిట్ అందుకున్న హీరో రాజశేఖర్ తాజాగా 'కల్కి' సినిమాలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. 

'గరుడ వేగ' చిత్రంతో భారీ హిట్ అందుకున్న హీరో రాజశేఖర్ తాజాగా 'కల్కి' సినిమాలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సోమవారం నాడు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమా టీజర్ ని విడుదల చేసింది.

ఈ టీజర్ లో రాజశేఖర్ చాలా పవర్ ఫుల్ గా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించారు. 1980 నేపధ్యంలో సంఘటనల ఆధారంగా క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకా ముప్పై శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉంది.

భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నందితా శ్వేతా, రాహుల్ రామకృష్ణ, నాజర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను సి కళ్యాణ్  నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ స్వరకర్త. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే