RRR: తారక్ ఎంట్రీ కోసం హై టెక్నాలిజీ?

Published : Sep 13, 2019, 02:58 PM IST
RRR: తారక్ ఎంట్రీ కోసం హై టెక్నాలిజీ?

సారాంశం

దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ షూటింగ్ ప్రస్తుతం బల్గెరియాలో కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఇంట్రడక్షన్ సీన్స్ ని భారీ ఖర్చుతో షూట్ చేస్తున్నట్లు సమాచారం.

దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ షూటింగ్ ప్రస్తుతం బల్గెరియాలో కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఇంట్రడక్షన్ సీన్స్ ని భారీ ఖర్చుతో షూట్ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోల పాత్రలను ఏ విధంగా పరిచయం చేస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

ఇక 450కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న RRR సినిమాలో కూడా ఆ ఇంట్రడక్షన్ సీన్స్ అదిరిపోతాయని ఊహించవచ్చు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ సినిమా తీసినప్పుడు అందులో తారక్ ని పులితో పోలుస్తూ దర్శకుడు అద్భుతమైన సీన్స్ ని క్రియేట్ చేశాడు . ఇక ఇప్పుడు కూడా పెద్దపులులతో తారక్ ఇంట్రడక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 

విఎఫ్ఎక్స్ తో కూడిన ఈ సన్నివేశాల కోసం హై టెక్నాలిజీ కెమెరాలను వాడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20కోట్ల వరకు తారక్ ఎంట్రీ కోసం ఖర్చు చేయనున్నారట. మరి ఆ సీన్ ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Maa Vande: మోదీ బయోపిక్‌ `మా వందే` బడ్జెట్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. వామ్మో ఇది హాలీవుడ్‌ రేంజ్‌
Anchor Rashmi: కల్చర్‌ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్‌ క్రేజీ కౌంటర్‌.. కుక్కల సమస్యపై ఆవేదన