RRR 2 చేస్తారా ? ఉపాసన ప్రశ్నకి స్పందించిన రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ అల్లరి వైరల్

Published : May 15, 2025, 07:05 AM IST
RRR 2 చేస్తారా ? ఉపాసన ప్రశ్నకి స్పందించిన రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ అల్లరి వైరల్

సారాంశం

దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం లండన్ లో సందడి చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ చిత్ర లైవ్ కాన్సర్ట్, ప్రీమియర్ ప్రదర్శన జరుగుతోంది.

దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం లండన్ లో సందడి చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ చిత్ర లైవ్ కాన్సర్ట్, ప్రీమియర్ ప్రదర్శన జరుగుతోంది. ప్రపంచ వేదికలపై  ఆర్ఆర్ఆర్ చిత్రానికి దక్కిన మరో గౌరవం ఇది. ఈ సందర్భంగా  రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ కుటుంబాలతో లండన్ లో సందడి చేస్తున్నారు.

రాయల్ ఆల్బర్ట్ హాల్ నుంచి వస్తున్న దృశ్యాలు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో క్రేజీ వీడియో బయటకు వచ్చింది.  రాంచరణ్ సతీమణి ఉపాసన స్వయంగా ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఎప్పటిలాగే  రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రాజమౌళిని ఆటపట్టిస్తూ కనిపించారు. వాళ్ళిద్దరి అల్లరిని రాజమౌళి భరించలేకపోతుండడం సరదాగా అనిపిస్తుంది.

అక్కడే ఉన్న ఉపాసన రాజమౌళిని ఒక ఆసక్తికర ప్రశ్న అడిగింది. రాజమౌళి గారు ఇప్పుడు మీరు  ఆర్ఆర్ఆర్ 2 చేస్తారా అని ప్రశ్నించింది. దీనికి రాజమౌళి ఎస్ అని సమాధానం ఇచ్చారు. వెంటనే ఉపాసన గాడ్ బ్లెస్ యు అని స్పందించింది. ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ 2 ఉంటుందని రాజమౌళి సరదాగా తెలిపారా లేక నిజంగానే ఆయన మైండ్లో  ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ ఆలోచన ఉందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా అయితే మరోసారి  ఆర్ఆర్ఆర్ 2 చర్చ ఫ్యాన్స్ లో మొదలైంది.


రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఎన్టీఆర్, చరణ్ మరోసారి తమ బాండింగ్ చాటుకున్నారు స్క్రీన్ పై నాటు నాటు వస్తున్న సమయంలో చరణ్ ఎన్టీఆర్ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని కనిపించారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో వేదికపై చరణ్ ఎన్టీఆర్ కి అడ్వాన్స్ బర్త్డే విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. చరణ్ లాంటి బెస్ట్ డాన్సర్ తో నాటు నాటు సాంగ్ లో డాన్స్ చేయడం మరిచిపోలేని అనుభూతి అని తెలిపారు.

2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఏకంగా 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించారు. స్వాతంత్ర యోధుల పాత్రల ఆధారంగా రాజమౌళి కల్పిత కథతో అద్భుతం చేశారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Feb 23: భాగ్యానికి దొరికిపోయిన నర్మద సాగర్, వల్లికి పండగే పండగ
Gunde Ninda Gudi Gantalu: దినేష్ వేసిన వలలో చిక్కుకున్న మనోజ్.. బాలు,మీనాలను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న ప్రభావతి