రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబో మూవీ టైటిల్ ఫిక్స్ చేసిన జక్కన్న

Published : Jan 16, 2018, 02:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబో మూవీ టైటిల్ ఫిక్స్ చేసిన జక్కన్న

సారాంశం

రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసిన జక్కన్న గతంలోనూ ఇదే టైటిల్ తో సూపర్ హిట్ టాలీవుడ్ మూవీస్

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలువీధులా రెపరెపలాడించి టాలీవుడ్ జెండా ఎగరేసిన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రాంచరణ్ ల కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం కానున్న ఈ చిత్రం కోసం అప్పుడే టైటిల్ అన్వేషణలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు "ఇద్దరూ ఇద్దరే" అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.

 

ఇదే టైటిల్ తో గతంలో రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. కృష్ణ - శోభన్ బాబుల కాంబినేషన్లో ఒకసారి, అక్కినేని నాగేశ్వర రావు- నాగార్జున ల కాంబినేషన్లో మరోసారి. అయితే నాగేశ్వరరావు- నాగార్జున ల కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరూ ఇద్దరే డిజాస్టర్ కాగా కృష్ణ - శోభన్ బాబు ల ఇద్దరూ ఇద్దరే హిట్ అయ్యింది.

 

ఇద్దరు కూడా స్టార్ హీరోలు కాబట్టి ఆపై తెలుగు ప్రేక్షకులను అలరించాలంటే వాళ్ళ అభిరుచి మేరకు టైటిల్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ వ్యక్తి ఆరాధన ఎక్కువ కాబట్టి ఈ టైటిల్ పట్ల మొగ్గు చూపుతున్నారట రాజమౌళి. పైగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ , చరణ్ లు ఇద్దరు కూడా పోలీస్ అధికారులు గా నటించనున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ప్రభంజనం సృష్టించడం ఖాయం.

PREV
click me!

Recommended Stories

శ్రీవిష్ణు మృత్యుంజయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..సీట్ ఎడ్జ్ మీద కూర్చునేలా సీన్లు, క్రైమ్ థ్రిల్లర్ తో సూపర్ హిట్ ?
Super Star Krishna: మహేష్ బాబు చేయాల్సిన మూవీ నాగార్జున చేతికి.. కృష్ణ అడ్డుపడకపోతే పెద్ద ఘోరమే జరిగేది