'ఆర్‌ ఆర్‌ ఆర్‌' లో పాత్రపై క్లారిటి ఇచ్చిన అజయ్ దేవగన్

Published : Feb 18, 2019, 10:48 AM IST
'ఆర్‌ ఆర్‌ ఆర్‌' లో పాత్రపై క్లారిటి ఇచ్చిన అజయ్ దేవగన్

సారాంశం

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.ఈ  సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది. అయితే అందులో రూమర్సే అధికం.  తాజాగా ఈ చిత్రంలో  బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తాజాగా వార్తలు వచ్చాయి.

అక్కడితో ఆగేదు ఆయన పాత్ర చిన్నదే అయినా ఆసక్తికరంగా ఉండబోతోందని అజయ్‌ సన్నిహితులు మీడియా ద్వారా వెల్లడించారని రాసేసారు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాను హిందీలో ‘మక్కీ’ పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాకు అజయ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అప్పటి నుంచి రాజమౌళి, అజయ్‌ మంచి స్నేహితులయ్యారు. అందుకే సినిమాలో అజయ్‌కు అవకాశం ఇచ్చినట్లు కారణం కూడా వినిపించారు. ప్రస్తుతం అజయ్‌ ‘తానాజీ’ సినిమాలో నటిస్తున్నారని, ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక ఆయన ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలో నటిస్తారని  చెప్పారు. 

ఈ విషయమై అజయ్ దేవగన్ స్పందించారు.  'ఆర్ఆర్ఆర్'లో తాను నటిస్తున్నానన్న వార్తలపై మాట్లాడుతూ.., రాజమౌళి ఇంతవరకూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశాడు. తాను రాజమౌళి సినిమాలో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవమూ లేదని చెప్పాడు.  

అయితే 'భారతీయుడు-2'లో విలన్ పాత్రను పోషించాలని శంకర్ తనను సంప్రదించిన మాట వాస్తవమేనని అన్నాడు. కానీ తాను 'తానాజీ' సినిమాతో బిజీగా ఉండటంతో ఈ చిత్రాన్ని అంగీకరించలేక పోయానని అన్నాడు. 

ఇక ఇప్పటి వరకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు సంబంధించిన టైటిల్‌ కానీ ఫస్ట్‌లుక్‌ కానీ ఇతర నటీనటుల వివరాలు కానీ బయటకు రాలేదు. మార్చిలో రామ్‌చరణ్‌ పుట్టినరోజు వస్తోంది. అప్పుడైనా సినిమాలో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని చిత్రబృందం విడుదల చేస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్