రెండు సార్లు బ్రేకప్ అయింది.. హీరోయిన్ కామెంట్స్!

Published : Feb 18, 2019, 10:37 AM IST
రెండు సార్లు బ్రేకప్ అయింది.. హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

ప్రేమ విషయంలో తనకు అదృష్టం లేదని అంటోంది నటి ఐశ్వర్య రాజేష్. తమిళంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఉన్న బిజీ హీరోయిన్లలో ఒకరు. ప్రస్తుతం ఈమె చేతుల్లో చాలా సినిమాలే ఉన్నాయి. 

ప్రేమ విషయంలో తనకు అదృష్టం లేదని అంటోంది నటి ఐశ్వర్య రాజేష్. తమిళంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఉన్న బిజీ హీరోయిన్లలో ఒకరు. ప్రస్తుతం ఈమె చేతుల్లో చాలా సినిమాలే ఉన్నాయి.

అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ నటిగా తన సత్తా చాటుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను ప్రేమలో ఓడిపోయిన విషయాన్ని వెల్లడించింది. ప్లస్ టూ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డానని చెప్పిన ఈ బ్యూటీ అది మొదట్లోనే ముగిసిపోయిందని చెప్పుకొచ్చింది. 

తాను ప్రేమించిన యువకుడిని తన స్నేహితురాలే తన్నుకుపోయి తనను మోసం చేసిందని వెల్లడించింది. ఆ తరువాత కొన్నేళ్లకు మరోసారి ప్రేమలో పడ్డానని చెప్పిన ఐశ్వర్య..అప్పుడు కూడా బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందని తెలిపింది.

ప్రేమిస్తే అది కలకాలం సాగాలని కోరుకునే వ్యక్తినని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాల మీదనే ఉందని చెప్పింది. తనకు పనీపాటా లేకుండా తిరిగే అబ్బాయిలంటే అసలు నచ్చరని స్పష్టం చేసింది.  

PREV
click me!

Recommended Stories

Mysaa Glimpse Review: అడవిలో గర్జించిన రష్మిక మందన్న.. `మైసా` మూవీ ఫస్ట్ గ్లింప్స్ జస్ట్ గూస్‌ బమ్స్
కాంతార 1 రికార్డుకు గండి కొట్టిన ధూరందర్.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ?