యమా జోరుగా సాగుతున్న రాజమౌళి- మహేష్ బాబు సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఆసినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయింది. అసలు ఈవార్తల్ల నిజం ఎంత? ఒక వేళ నిజంగానే షూటింగ్ ఆగిపోతే దానికి కారణం ఏంటి?
దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో , పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది రాజమౌళి, మహేష్ బాబు సినిమా. భారీ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈసినిమాను ఎక్కువ శాతం ఫారెన్ లోనే షూటింగ్ చేయాల్సి ఉంది. దానికి సబంధించిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాడు జక్కన్న. అయితే ఇండియాలో కంప్లీట్ చేయాల్సిన షూటింగ్ ను పూర్తి చేసిన తరువాత ఫారెన్ షెడ్యూల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారట టీమ్. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ షూటింగ్ ను ప్లాన్ చేసుకున్నారు. ముందుగా పస్ట్ షెడ్యుల్ ను ఒరిస్సాలో స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు. ఆతరువాత హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్ లో మరికొంత షూటింగ్ జరిగినట్టు తెలుస్తోంది.
ఆతరువాతి షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారట. దీని తరువాత కొన్ని రోజులు ఇండియాలోనే షూటింగ్ చేసుకుని ఫారెన్ ప్లైట్ ఎక్కాలని అనుకున్నారట టీమ్. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి రీసెంట్ గా తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా రెన్యూవల్ చేయించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రాజమౌళి ఈ షూటింగ్ కు బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది.
ఎండలు బాగా మండిపోవడంతో అవుడ్ డోర్ షూటింగ్ చేసే పరిస్తితి లేదు. దాంతో దాదాపు 30 రోజుల పాటు ఈసినిమా షూటింగ్ కు రాజమౌళి బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. అయితే ఈలోపు మహేష్ బాబు సమ్మర్ ట్రిప్ ను ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ తన ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ కు వెళ్ళాడు. అక్కడ ఫ్యామిలీని వదిలేసి.. తాను మాత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇక ఇప్పుడు షూటింగ్ కు జక్కన్న సెలవులు ప్రకటించడంతో సూపర్ స్టార్ కూడా వెకేషన్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
మరి రాజమౌళి నిజంగానే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడా? లేకపోతే ఇవన్నీ గాసిప్స్ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది. అమెజాన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న మహేష్ బాబు సినిమాను భారీ ప్లానింగ్ తో ముందుకు తీసుకెళ్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాతో మహేష్ ఇమేజ్ హాలీవుడ్ రేంజ్ కు వెళ్ళబోతోంది. అంతే కాదు ఫస్ట్ డేనే 1000 కోట్లు కలెక్ట్ చేసేలా ఈమూవీ బిజినెస్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈసినిమా కోసం చాలామంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది