ఈ చిన్న సినిమా టీజర్.. ఇంటరెస్టింగ్ గా ఉందే!

Published : Jul 09, 2019, 03:06 PM ISTUpdated : Jul 09, 2019, 03:07 PM IST
ఈ చిన్న సినిమా టీజర్.. ఇంటరెస్టింగ్ గా ఉందే!

సారాంశం

ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ తో వచ్చిన చాలా సినిమాలు స్టార్ కాస్ట్ లేకపోయినా సక్సెస్ అందుకున్నాయి.

ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ తో వచ్చిన చాలా సినిమాలు స్టార్ కాస్ట్ లేకపోయినా సక్సెస్ అందుకున్నాయి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'బ్రోచేవారెవరురా' ఇదే కోవలోకి వస్తాయి. తాజాగా ఓ చిన్న సినిమా టీజర్ విడుదలైంది.

ఆ సినిమా కంటెంట్ చూస్తుంటే కూడా మంచి హిట్ అందుకునేలా కనిపిస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..? 'రాజా వారు రాణి గారు'. అందరూ కొత్త వాళ్లు కలిసి చేస్తోన్న ఈ సినిమా టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. బుర్రకథ చెబుతూ సినిమాలో పాత్రల్ని పరిచయం చేస్తూ ఫన్నీగా టీజర్ కట్ చేశారు.

పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో విజువల్స్ ఉండడం మరో ఆకర్షణగా నిలిచింది. 'కథలోని మరిన్ని పాత్రలు, మలుపులు, మెలికలు రంగరించి సింగారించి ఒక సుదినమున ట్రైలర్ రూపాన మీ ముందుకు తీసుకొస్తామని మనవి చేసుకుంటున్నాం' అంటూ టీజర్ చివర్లో చెప్పిన డైలాగ్ బాగుంది.

కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాని రవికిరణ్ కోల అనే వ్యక్తి డైరెక్ట్ చేస్తున్నాడు.  

 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?