విచారణకు హాజరు కాని రాజ్ తరుణ్.. ఏం కారణం చెప్పాడో తెలుసా..

Published : Jul 18, 2024, 11:34 PM IST
విచారణకు హాజరు కాని రాజ్ తరుణ్.. ఏం కారణం చెప్పాడో తెలుసా..

సారాంశం

రాజ్ తరుణ్ కి నార్సింగ్ పోలీసులు నోటీసులు కూడా పంపారు. ఈ నెల 18 వ తేదీలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అంటే గురువారం రోజుతో గడువు ముగిసింది.

యువ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ వ్యవహారాలు, వివాదాలతో వార్తల్లో నలిగిపోతున్నాడు. రాజ్ తరుణ్ రిలేషన్ షిప్, ప్రేమ వ్యవహారం ఎంతటి వివాదంగా మారిందో చూస్తున్నాము. రాజ్ తరుణ్ తాను గతంలో రిలేషన్ లో ఉన్న లావణ్య అనే యువత బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తోంది. రాజ్ తరుణ్ పై కేసు కూడా నమోదు చేసింది. 

ఈ కేసులో రాజ్ తరుణ్ కి నార్సింగ్ పోలీసులు నోటీసులు కూడా పంపారు. ఈ నెల 18 వ తేదీలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అంటే గురువారం రోజుతో గడువు ముగిసింది. కానీ రాజ్ తరుణ్ విచారణకు హాజరు కాలేదు. తన లాయర్ ని పంపాడు. 

తన చిత్రాల షూటింగ్స్, బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నాని రాజ్ తరుణ్ పోలీసులకు లేఖ రాసి తన లాయర్ తో పంపారు. విచారణకు హాజరయ్యేందుకు మరికొన్ని రోజుల సమయం గడువు కావాలని కోరాడు. త్వరలో రాజ్ తరుణ్ నటించిన చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాల ప్రచార కార్యక్రమాలు, ఇతర మూవీస్ షూటింగ్స్ తో రాజ్ తరుణ్ బిజీగా ఉన్నారని అతడి లాయర్ పోలీసులకు తెలిపారు. దీనితో పోలీసులు రాజ్ తరుణ్ లేఖని ఆమోదించారు. 

విచారణకు కొత్త తేదీ నిర్ణయించి మరోసారి నోటీసులని పోలీసులు పంపబోతున్నట్లు తెలుస్తోంది. లావణ్య ప్రేమ వ్యవహారంలో రాజ్ తరుణ్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోయినట్లు అర్థం అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Satluj OTT Release: 25000 మిస్సింగ్ కేసుల కథ, సెన్సార్ కష్టాలతో ఏళ్ల తరబడి వాయిదా..ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్
Alpha OTT Release: ఆలియా 'ఆల్ఫా' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?