`రైడ్ 2` ట్విట్టర్‌ రివ్యూ: అజయ్ దేవగన్ సినిమా సూపర్ హిట్!

Published : May 01, 2025, 08:46 AM IST
`రైడ్ 2` ట్విట్టర్‌ రివ్యూ: అజయ్ దేవగన్ సినిమా సూపర్ హిట్!

సారాంశం

బాలీవుడ్‌ మూవీ `రైడ్ 2`  గురువారం విడుదలైంది.  ప్రీమియర్స్ చూసిన ఆడియెన్స్ రియాక్ట్ అవుతున్నారు. అజయ్, రితేష్ నటన అదుర్స్ అంటున్నారు. ట్విట్టర్ రివ్యూ ఇక్కడ చూడండి!

`రైడ్ 2` ట్విట్టర్ రివ్యూ: అజయ్ దేవగన్  హీరోగా నటించిన `రైడ్ 2` సినిమా నేడు గురువారం థియేటర్లలో విడుదలైంది. అయితే ముందుగానే యూఎస్‌ ప్రీమియర్స్ ప్రదర్శించారు. దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా తీసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అజయ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ గా నటించారు. రితేష్ దేశ్ముఖ్ విలన్ గా కనిపించారు. తమన్నా ఒక డాన్స్ నెంబర్ లో కనిపించింది. రైడ్ 2 చూసిన ప్రేక్షకులు ఏమన్నారో చూద్దాం...

రైడ్ 2 సూపర్ హిట్ అంటున్నారు ప్రేక్షకులు

`రైడ్ 2` సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఒకరు "రైడ్ 2 రివ్యూ… 4.5 / 5, తప్పకుండా చూడండి" అని రాశారు. ఇంకొకరు "ముందు సినిమా కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అజయ్, రితేష్ నటన అదుర్స్. తప్పకుండా చూడాలి" అని రాశారు. ఇంకొకరు "రైడ్ 2 పవర్ఫుల్ మూవీ. 4 కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వచ్చు" అని రాశారు.

 

 

రైడ్ 2 ప్రేక్షకుల అభిప్రాయాలు

రైడ్ 2 సినిమా చూసిన ప్రేక్షకులు "సస్పెన్స్, దేశభక్తి, డ్రామా కలగలిసిన సినిమా" అని అభిప్రాయపడ్డారు. "అజయ్ దేవగన్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గా అదుర్స్" అని మరొకరు అన్నారు. "కథ చాలా బాగుంది. ప్రతి సీన్ థ్రిల్లింగ్ గా ఉంది" అని ఇంకొకరు అన్నారు.

100 కోట్ల బడ్జెట్ తో రైడ్ 2

రైడ్ 2 సినిమా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడింది. 2018 లో వచ్చిన రైడ్ కి సీక్వెల్ ఇది. అజయ్ దేవగన్ 75వ రైడ్ వేస్తున్నట్టు కథలో చూపించారు. థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమాలో అజయ్ కి జోడీగా వాణీ కపూర్ నటించింది. రితేష్ దేశ్ముఖ్ విలన్ గా నటించారు. తమన్నా, జాక్వెలిన్ డాన్స్ నెంబర్స్ లో కనిపించారు.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?