‘నల్లబంగారం’ అంటూ రాహుల్ సిప్లిగంజ్ కు ప్రశ్న.. తన రంగుపై అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన గల్లీ బాయ్..

By Asianet News  |  First Published Mar 20, 2023, 12:01 PM IST

గల్లీ నుంచి ‘ఆస్కార్’ వేదిక వరకు వెళ్లిన టాలెంటెడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ ప్రస్తుతం మాములుగా లేదు. అలాంటిది తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్ కు తన రంగుపై ప్రశ్న ఎదురైంది. అదిరిపోయే ఆన్సర్ తో ఆకట్టుకున్నారు.
 


గల్లీలో మొదలైన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) క్రేజ్ ‘ఆస్కార్’ వేదిక వరకు వెళ్లడం గొప్పవిషయమనే చెప్పాలి. 95వ ఆస్కార్స్ వేడుకలో కాలభైరవతో కలిసి ‘నాటు నాటు’లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. దీంతో రాహుల్ ఫ్యాన్స్ తోపాటు సంగీత ప్రియులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే రాహుల్ సాంగ్స్ తోనే కాకుండా.. నటుడిగానూ ఆకట్టుకునేందుకు సిద్ధం అయ్యారు. ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో ఓ ముఖ్య పాత్రలో నటించారు.

ఉగాది సందర్భంగా  మార్చి22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలో రాహుల్ కు తన రంగుపై ప్రశ్న ఎదురైంది. ‘రంగమార్తాండ తో నల్లబంగారం అనే పేరు వచ్చింది. దీనిపై మీ స్పందన ఏంటీ?’ అని అడగ్గా.. రాహుల్ చాలా ఆసక్తికరంగా బదులిచ్చారు. రాహుల్ మాట్లాడుతూ.. ‘తెల్లగున్నొళ్లంతా మిల్కీ బార్ చాక్లెట్లు.. నల్లగున్నోళ్లంతా డైరీమిల్క్, కిట్ కాట్, క్యాట్ బెర్రీ,  ఫైవ్ స్టార్ లాంటి వాళ్లు. బేసిగ్గా మేం స్వీట్ గా ఉంటాం. ఈ సినిమాతో ఆ టైటిల్ రావడం సంతోషిస్తున్నాను.’ అని చెప్పుకొచ్చారు. 

Latest Videos

రాహుల్ చాలా సరదాగా ఇచ్చిన ఆన్సర్ కు  ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.  ఆ వీడియోను సైతం రాహుల్ తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. దీనిపై అభిమానులు, నెటిజన్లు కూడా ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్ ఇచ్చిన ఆన్సర్ కు అభినందిస్తున్నారు. రాహుల్ మనస్సు కూడా స్వీట్ అంటూ పొగుడుతున్నారు. చాక్లెట్ ఉదాహరణతో చాలా స్పోర్టీవ్ గా బదులివ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రంగమార్తాండ’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రీమియర్స్ టాక్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.

సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్, సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కిస్తున్నారు. రంగస్థల నటీనటుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని మరాఠిలో తెరకెక్కిన సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు రీమేక్ గా తెలుగులో  వస్తోంది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాహుల్ సిప్లిగంజ్ తోపాటు శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

click me!