ఎట్టకేలకు కాబోయే భర్తని పరిచయం చేసిన నాగ చైతన్య హీరోయిన్.. ఇద్దరూ వెరీ రొమాంటిక్, వరుడు ఎవరంటే.. 

By Asianet News  |  First Published Nov 15, 2023, 7:39 PM IST

కార్తీక కెరీర్ ఆరంభంలో మంచి అవకాశాలే అందుకుంది. తమిళంలో పలు చిత్రాల్లో నటించింది కార్తీక. రంగం చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ సొంతం చేసుకుంది.


సీనియర్ హీరోయిన్ రాధ గురించి పరిచయం అక్కర్లేదు. 80,90 దశకాల్లో రాధ అనేక చిత్రాల్లో నటించింది. టాప్ లీగ్ హీరోయిన్ గా రాణించింది. \ మెగాస్టార్ చిరంజీవి సరసన అత్యధిక చిత్రాల్లో నటించిన రాధ గ్లామర్ హీరోయిన్ గా, స్టార్ బ్యూటీగా వెలుగు వెలిగింది. అయితే రాధ తన కుమార్తె కార్తీక నైర్ ని కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ చేయాలనీ ప్రయత్నించింది. 

కార్తీక కెరీర్ ఆరంభంలో మంచి అవకాశాలే అందుకుంది. తమిళంలో పలు చిత్రాల్లో నటించింది కార్తీక. రంగం చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో కార్తీక నాగ చైతన్య జోష్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత కార్తీకకి సరైన అవకాశాలు రాలేదు. దీనితో కార్తీక సినీ కెరీర్ త్వరగానే ముగిసింది అని చెప్పాలి. 

Latest Videos

ప్రొఫెషనల్ లైఫ్ ముగియడంతో కార్తీక పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టింది. కొన్ని వారాల క్రితం కార్తీక తన నిశ్చితార్థం ఫోటో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.  కార్తీక ఓ వ్యక్తిని హగ్ చేసుకుని ఉన్న పిక్ ని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అయితే తనకి కాబోయే భర్త మాత్రం చూపించలేదు. దీనితో కార్తీకకి కాబోయే భర్త ఎవరనే ఉత్కంఠ కొనసాగింది. ఉత్కంఠకి తెరదించుతూ కార్తీక తన కి కాబోయే భర్తని అభిమానులకు పరిచయం చేసింది. 

ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసింది. కొత్త జంట ఇద్దరూ చాలా రొమాంటిక్ గా ఉన్నారు. నిచ్చితార్ధం పూర్తయింది కాబట్టి త్వరలో వివాహం జరగబోతోంది. తన కుమార్తె వివాహానికి రాధ ఇటీవల రాఘవేంద్ర రావు లాంటి ప్రముఖుల్ని ఇన్వైట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కార్తీక పెళ్లి చేసుకునే వ్యక్తి పేరు రోహిత్ మీనన్. అయితే అతడి పూర్తి వివరాలు, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి ఇంకా తెలియలేదు. 

కార్తీక.. రోహిత్ మీనన్ తో ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ.. నిన్ను కలవడం డెస్టినీ ప్రకారం జరిగింది. నీతో ప్రేమలో పడడం మ్యాజిక్.. నీతో జీవితాన్ని పంచుకునేందుకు కౌంట్ డౌన్ ప్రారంభించా అంటూ కార్తీక రొమాంటిక్ పోస్ట్ పెట్టింది. ఆమె వ్యాఖ్యల ప్రకారం కార్తీక లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్లు క్లియర్ గా అర్థం అవుతోంది. కొత్త జంటకి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

click me!