బరువు తగ్గడం కోసం హిమాలయాల వరకు వెళ్లిందట!

Published : Sep 16, 2019, 03:38 PM IST
బరువు తగ్గడం కోసం హిమాలయాల వరకు వెళ్లిందట!

సారాంశం

కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన సినిమాల్లో బొద్దుగా కనిపించిన ఈ భామ కొన్నాళ్లకు ఉన్నట్టుండి బరువు తగ్గింది. ఇప్పుడు నాజూకుగా కనిపిస్తూ తన లుక్స్ తో ఆకట్టుకుంటోంది.  అయితే తానూ బరువు అంత తేలికగా తగ్గలేదని చెబుతోంది రాశి.

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోతుంది. మొదట్లో కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఎంతో కష్టపడి బరువు తగ్గింది. ఆమె బరువుపై తొలినాళ్లలో సోషల్ మీడియాలో విమర్శలు వినిపించేవి. కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన సినిమాల్లో బొద్దుగా కనిపించిన ఈ భామ కొన్నాళ్లకు ఉన్నట్టుండి బరువు 
తగ్గింది.

ఇప్పుడు నాజూకుగా కనిపిస్తూ తన లుక్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే తానూ బరువు అంత తేలికగా తగ్గలేదని చెబుతోంది రాశి. సన్నబడడం కోసం హిమాలయాల వరకు వెళ్లినట్లు చెబుతోంది. తన బొద్దుతనం గురించి రకరకరాల కామెంట్స్ రావడంతో ఎన్నో రకాల డైటింగ్ లు చేశానని.. సంవత్సరం పాటు కేవలం పండ్లు, కూరగాయలు, ఉడికించిన చేపలు తిన్నానని.. కానీ ఫలితం లేకపోయిందని.. పైగా హార్మోనల్ సమస్యలు వచ్చాయని రాశి చెప్పింది.

బరువు తగ్గకపోగా.. ఇంకా పెరిగానని.. ఆ సమయంలో ఎంతో బాధ పడిపోయానని చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో తన స్నేహితురాలు చెప్పడంతో హిమాలయాలకు వెళ్లానని.. అక్కడి ఆనందాశ్రమానికి వెళ్తే తన శరీరం 'కఫ'తత్వం అని.. ఏం తినాలో ఏం తినకూడదో చెప్పారని.. ఒక్కరాత్రిలో ఏదీ జరగదని హితవు పలికారని.. అక్కడ నుండి తిరిగి వచ్చిన తరువాత కుల్ దీప్ అనే ట్రైనర్ పరిచయం అయ్యాడని.. అతడి సహకారంతో బరువు తగ్గే ట్రైనింగ్ తీసుకొని.. డైట్ మీద దృష్టి పెడితే నెమ్మదిగా బరువు తగ్గానని వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌