పుష్ప షూట్‌ కోసం బన్నీ ప్లాన్‌.. తెలంగాణలోనే!

Published : Jul 07, 2020, 09:35 AM IST
పుష్ప షూట్‌ కోసం బన్నీ ప్లాన్‌.. తెలంగాణలోనే!

సారాంశం

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేరళ అడవుల్లో షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవటంతో తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పుష్ప టీం. ముఖ్యంగా కేరళ అడవుల తరుహాలోనే కనిపించే మహబూబ్‌ నగర్‌ అడువుల్లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట పుష్ప యూనిట్‌.

ఈ ఏడాది మొదట్లోనే అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్‌ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్నట్టుగా ప్రకటించాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కేరళలో తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. బన్నీ లేకుండానే తొలి షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేశాడు సుకుమార్. అయితే ఈ లోగా లాక్‌ డౌన్‌ రావటంతో షూటింగ్ ఆగిపోయింది.

అయితే తిరిగి షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేరళ అడవుల్లో షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవటంతో తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కేరళ అడవుల తరుహాలోనే కనిపించే మహబూబ్‌ నగర్‌ అడువుల్లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట పుష్ప యూనిట్‌. ఇప్పటికే ఈ మేరకు చిత్రయూనిట్ లోకేషన్లను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.

అదే సమయంలో హైదరబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఫారెస్ట్ సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను మరింతగా ఫైన్‌ ట్యూన్ చేస్తున్న చిత్రయూనిట్ త్వరలోనే షూటింగ్ ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?