తెలుగులోకి కన్నడ పవర్ స్టార్ ‘సివిల్ ఇంజినీర్’ మూవీ.. ‘దసరా’ కానుకగా టీజర్ విడుదల.!

Published : Oct 05, 2022, 04:09 PM IST
తెలుగులోకి కన్నడ పవర్ స్టార్ ‘సివిల్ ఇంజినీర్’ మూవీ.. ‘దసరా’ కానుకగా టీజర్ విడుదల.!

సారాంశం

కన్నడ పవర్ స్టార్, దివంగత డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) నటించిన కన్నడ చిత్రాన్ని తెలుగులో ‘సివిల్ ఇంజినీర్’గా అలరించబోతోంది. దసరా కానుకగా చిత్రయూనిట్ తాజాగా టీజర్ ను విడుదల చేసింది.  

కన్నడ పవర్ స్టార్, లేట్ హీరో పునీత్ రాజ్ కుమార్ గతేడాది ఇదే నెలలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన భౌతికంగా లేకపోయినా పునీత్ రాజ్ కుమార్ నటించిన చిత్రాలతో ఎప్పుడూ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు  ఆడియెన్స్ లోనూ అప్పు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసందర్భంగా కన్నడలో రూపొంది 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘చక్రవ్యూహ’ బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. తమిళ చిత్రం ‘ఇవాన్ వెరమాతిరి’గా మలయాళంలో రీమేక్ చేశారు. అయితే అదే చిత్రాన్ని ప్రస్తుతం తెలుగు వెర్షన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్నీ ఏర్పాట్లు చేశారు.  

తెలుగులో మూవీని ‘సివిల్ ఇంజినీర్’ (Civil Engineer)గా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా దసరా కానుకగా మూవీ టీజర్ ను విడుదల చేశారు. కమర్షియల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో కాలేజీలో గొడవలు, ఓ విద్యార్థి హత్య, న్యాయం కోసం చేసే పోరాటం వంటివి సినిమా కథగా తెలుస్తోంది. రచిత, పునీత్ మధ్య రొమాన్స్ సీన్లు కూడా ఆకట్టుకుంటున్నాయి.  టీజర్ ఇంట్రెస్టింగ్ గానూ చాలా కొత్తగా కనిపిస్తోంది. మూవీ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీత అందించారు.  

ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ ప్రధాన  పాత్రల్లో నటించారు. హీరోయిన్ గా డింపుల్ క్వీన్ రచితా రామ్ నటించింది. అరుణ్ విజయ్ నెగెటివ్ రోల్ ను పోషించారు. తెలుగులో సినిమాను చందన ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేయబోతోంది. దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల కాలంలో పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘యువరత్న’,‘జేమ్స్’ అలరించిన విషయం  తెలిసిందే. ప్రస్తుతం ‘సివిల్ ఇంజినీర్’  కూడా  ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని ఆశిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Operation Aruna Reddy Review: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ రివ్యూ.. పోసాని ఎట్టకేలకు హిట్‌ కొట్టాడా?
Allu Arjun: గర్భవతి అయినా అల్లు అర్జున్ కోసం దుమ్ములేపుతున్న నటి..ప్రమాదం అని తెలిసి కూడా తగ్గడం లేదు