నంది అవార్డులపై నిర్మాత ఆది శేషగిరి రావు సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే..

Published : May 01, 2023, 12:18 PM ISTUpdated : May 01, 2023, 02:29 PM IST
నంది అవార్డులపై నిర్మాత ఆది శేషగిరి రావు సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే..

సారాంశం

నంది అవార్డులపై సినీ నిర్మాత, ప్రముఖ నటుడు  మహేష్ బాబు బాబాయ్ ఆది శేషగిరిరావు సంచలన వ్యాఖ్యలు  చేశారు. నంది అవార్డులపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆసక్తి లేదని అన్నారు.

హైదరాబాద్‌: నంది అవార్డులపై సినీ నిర్మాత, ప్రముఖ నటుడు  మహేష్ బాబు బాబాయ్ ఆది శేషగిరిరావు సంచలన వ్యాఖ్యలు  చేశారు. నంది అవార్డులపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆసక్తి లేదని అన్నారు. తన ఉద్దేశంలో నంది అవార్డులకు ప్రాముఖ్యత లేదని తెలిపారు. పలుకుబడి ఉన్నవారికే  ప్రభుత్వాలు అవార్డులు ఇస్తున్నాయని ఆరోపించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు  సినీ  పరిశ్రమను పట్టించుకోవడం లేదని అన్నారు. మే 31న కృష్ణ జయంతి సందర్భంగా 4కే టెక్నాలజీతో మోసగాళ్లకు మోసగాడు విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. కృష్ణ పేరుపై మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్టుగా  తెలిపారు.  

ఇదిలా ఉంటే.. నంది అవార్డులపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ చాలా వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డ్స్ ఇస్తున్నారని తెలిపారు.  రెండు, మూడేళ్ల తర్వాత అన్ని ఉత్తమ  సినిమాలకు సక్రమంగా అవార్డులు ఇస్తారని చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజ విన్నర్ కాదు... ఎలిమినేషన్ తర్వాత భరణి షాకింగ్ కామెంట్స్
Dhurandhar: ధురంధర్ ధాటికి ఈ సినిమాల రికార్డులు గల్లంతు.. నెక్స్ట్ టార్గెట్ రష్మిక మూవీనే