కరోనా మృతుల కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యః ప్రియాంక డిమాండ్‌.. సోనూసూద్‌కి మద్దతు

By Aithagoni RajuFirst Published May 3, 2021, 7:38 PM IST
Highlights

కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఉచితంగా విద్యని అందించాలని డిమాండ్‌ చేసింది గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. రియల్‌ హీరో సోనూ సూద్‌ తీసుకొచ్చిన ప్రతిపాదనని ఆమె సపోర్ట్ చేసింది. 

కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఉచితంగా విద్యని అందించాలని డిమాండ్‌ చేసింది గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. రియల్‌ హీరో సోనూ సూద్‌ తీసుకొచ్చిన ప్రతిపాదనని ఆమె సపోర్ట్ చేసింది. సోనూకి మద్దతు పలుకుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఫోకస్‌ పెట్టాలే చెప్పింది. ఈ విషయంలో సోనూ ఆలోచనా విధానాన్ని, ఆయన ఇంతటి క్లిష్ట సమయంలోనూ ఇలాంటి గొప్ప ఆలోచనలతో ముందుకు రావడం అభినందనీయమని తెలిపింది. ట్విట్టర్‌ ద్వారా ఓ నోట్‌ని పంచుకుంది ప్రియాంక. 

ఇందులో ఆమె చెబుతూ, ఇతరులకు సహాయం చేసే మనస్థత్వంతో ఉన్నవారిలో నా సహ నటుడు సోనూ సూద్‌ ఒకరు. ఆయన ఆలోచనలో చాలా గొప్పగా ఉంటాయి. కరోనా కారణంగా చాలా మంది చనిపోతున్నారు. ఇంట్లో పేరెంట్స్, ఇన్‌కమ్‌ సోర్స్ అయిన తండ్రులు చనిపోతున్నారు. దీంతో ఆ ఇంటికి పెద్ద ఆర్థిక నష్టం కలుగుతుంది. ఆదాయ మార్గం కోల్పోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి కుటుంబాల పిల్లలకు, కరోనాతో మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఉచితంగా ప్రభుత్వం విద్యని అందించాలి. 

ఈ విషయంలో సోనూ దీనిపై ఇంతటి ఆలోచన చేసినందుకు, ఆయన ఇలాంటి క్షిష్టమైన ఆలోచన చేసినందుకు ఆయన్ని అభినందిస్తున్నా. అంతేకాదు తన ఆలోచనలో యాక్షన్‌లో చూపించడం ఆకట్టుకుంది. సోనూ ఈ విషయంలో ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. మృతుల కుటుంబాల పిల్లలు ఏ స్టేజ్‌లో చదువుతున్నా, స్కూల్‌ అయినా, కాలేజ్‌ అయినా, ఉన్నత విద్య అయినా ఉచితంగా అందించేలా చూడాలని కోరుతున్నా` అని పేర్కొంది ప్రియాంక. దీనిపై మరింత మంది ముందుకొచ్చి తమ గళాన్ని వినిపించాలని ఆమె కోరింది. 

. https://t.co/fpDKac1PSx pic.twitter.com/cHvpOuZEvp

— PRIYANKA (@priyankachopra)
click me!