ప్రియమణి వండబోతున్న కొత్త రకమైన వంట `భామా కలాపం`.. ఆసక్తి రేకెత్తిస్తున్న ఫస్ట్ గ్లింప్స్

Published : Jan 16, 2022, 01:30 PM IST
ప్రియమణి వండబోతున్న కొత్త రకమైన వంట  `భామా  కలాపం`.. ఆసక్తి రేకెత్తిస్తున్న  ఫస్ట్ గ్లింప్స్

సారాంశం

గతేడాది  ప్రియమణి `నారప్ప`, `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వంటి సినిమా, వెబ్‌ సిరీస్‌తో మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె తెలుగు ఓటీటీ  యాప్‌ `ఆహా`లో వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. 

ప్రియమణి(Priyamani) మల్టీపుల్‌ మాధ్యమాల్లో తన సత్తాని చాటుతుంది. ఓ వైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ, మరోవైపు వెబ్‌ సిరీస్‌లు, ఇంకో వైపు టీవీ షోస్‌, దీంతోపాటు ఓటీటీ ఫిల్మ్స్ ఇలా ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు. నటిగా తనని తాను నిత్యం బిజీగా ఉంచుకుంటూ, నిత్యం మల్టీపుల్‌ మాధ్యమాల్లో ఆడియెన్స్ ని, తన అభిమానులను అలరిస్తుంది. 

గతేడాది Priyamani `నారప్ప`, `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వంటి సినిమా, వెబ్‌ సిరీస్‌తో మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె తెలుగు ఓటీటీ  యాప్‌ `ఆహా`లో వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. `భామా కలాపం` (Bhama Kalapam) పేరుతో రూపొందుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇందులో ఆమె యూట్యూబ్‌లో వంటకాలు చేసే కుక్కింగ్‌ మహిళగా  కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 

`వెయ్యిమంది  సబ్‌స్క్రైబర్స్, వెయ్య రకాల రెసిపీస్‌.. ప్రతి వారం ఓ కొత్త వంట. కానీ  ఇప్పుడు చేయబోయే వంట చాలా స్పెషల్‌.  ఎందుకంటే ఈ వంట ఎలా చేయాలో నాక్కూడా తెలియదు` అంటోంది ప్రియమణి. ఈ సందర్భంగా ప్రియమణి పెద్ద కత్తి  పట్టుకుని దేన్నో కొడుతుండగా, ఆ సమయంలో ఆమెకి చెమటలు పట్టడం సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తుంది. ఈ  సందర్భంగా `ప్రియమణి ఏం వండుతున్నారో తెలియదు కానీ,  మనకి మాత్రం ఒక మంచి కామెడీ థ్రిల్లర్‌ ని వడ్డిస్తారు` అని ఆహా పంచుకున్న క్యాప్షన్‌ ఆకట్టుకుంటుంది. 

`డియర్‌ కామ్రేడ్‌` ఫేమ్‌ భరత్‌ కమ్మ సమర్పణలో అభిమాన్యు దర్శకత్వం వహించిన `భామా కలాపం` కి బాపినీడు, సుధీర్‌ ఈదర  నిర్మిస్తున్నారు. త్వరలో ఇది `ఆహా`లో స్ట్రీమింగ్‌ కాబోతుంది.  ప్రస్తుతం ప్రియమణి సినిమాల  పరంగా `విరాటపర్వం`, `మైదాన్‌`, `సైనాయిడ్‌`, `డాక్టర్‌ 56`, `కొటేషన్‌ గ్యాంగ్‌`,  `ఖాయమరా`తోపాటు అట్లీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఎన్టీఆర్ కోసం ధనుష్ కు హ్యాండ్ ఇచ్చిన పాన్ ఇండియా హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Papam Prathap Review: `పాపం ప్రతాప్‌` మూవీ రివ్యూ, తిరువీర్‌ సినిమా నవ్వించిందా?